ETV Bharat / international

అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాల- శ్వేతసౌధాన్ని తాకిన సెగ - protest in us today

అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి న్యాయం జరగాలని చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్వేతసౌధం వద్ద ఆందోళనకారులు గుమిగూడిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సహా కుటుంబసభ్యులు అండర్​గ్రౌండ్​లో గడిపారు.

Looting rampant in downtown Washington
ఉద్యమ క్షేత్రంగా అగ్రరాజ్యం
author img

By

Published : Jun 1, 2020, 3:00 PM IST

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వరుసగా ఆరో రోజు రణరంగంగా మారింది. ఫ్లాయిడ్​కు న్యాయం జరగాలంటూ జరుగుతున్న ఈ నిరసనల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • ఆందోళనలను అరికట్టేందుకు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. 140 నగరాలు, పట్టణాల్లో నిరసనలు జరుగుతున్నాయి.
  • శ్వేతసౌధం వద్ద ఆందోళనకారులు గుమిగూడిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు.
    Looting rampant in downtown Washington
    నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
  • శ్వేతసౌధం వద్ద నిరసనలు చెలరేగడం వల్ల అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ పౌరురాలు మెలానియా వారి కుమారుడు బారన్ ట్రంప్ అండర్​ గ్రౌండ్​లోని గదిలో గంటపాటు ఉన్నారు.
    Looting rampant in downtown Washington
    శ్వేతసౌధం వద్ద భారీ భద్రత
  • నిరసనల వెనక వామపక్ష సంస్థ ఆంటిఫా ఉందని.. దానిని ఉగ్రవాద సంస్థగా తీర్మానిస్తామని ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు ట్రంప్.
  • ఆందోళనలను అణిచేందుకు ఇప్పటికే 5 వేలమంది నేషనల్ గార్డ్స్​ను​ మోహరించారు. అవసరమైతే మరో 2 వేలమందిని తరలించనున్నట్లు చెప్పారు.
    Looting rampant in downtown Washington
    ఆందోళనలను అణిచేందుకు ఇప్పటికే 5వేలమంది నేషనల్ గార్డ్స్​ మోహరింపు
  • ఇప్పటివరకు 24 నగరాల్లోని 2,564 మందిని అరెస్టు చేశారు. లాస్​ ఏంజెల్స్​లోనే అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి.
    Looting rampant in downtown Washington
    ఆందోళనల్లో ధ్వంసమైన పోలీసు వాహనం
  • బర్మింగ్​హామ్​లో ఓ స్మారకాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు నిరసనకారులు.
    Looting rampant in downtown Washington
    అగ్నికి ఆహుతైన ఓ దుకాణం
  • బోస్టన్​లో ఓ పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
    Looting rampant in downtown Washington
    ఉద్రిక్తంగా మారిన నిరసనలు
  • ఫిలడెల్ఫియాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పెప్పర్ స్ప్రే వినియోగించారు.
    Looting rampant in downtown Washington
    ఓ దుకాణాన్ని ధ్వంసం చేసి వస్తువులను ఎత్తుకెళ్తున్న నిరసనకారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.