ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. 232-197 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్‌కు చెందిన 10 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు తెలిపారు.
ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదంతో రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోనున్నారు ట్రంప్. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలంటే ఈ తీర్మానం అమెరికా ఎగువ సభ సెనేట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ రిపబ్లికన్ల మెజారిటీ ఉన్నందున ఆమోదం లభించే అవకాశాలు తక్కువే.