ETV Bharat / international

చరిత్ర సృష్టించిన కమల.. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం - కమలా హారిస్​ ఈటీవీ భారత్​

56ఏళ్ల కమలా హారిస్​ చరిత్ర సృష్టించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నల్లజాతియురాలిగా, తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. బైడెన్​ ప్రమాణానికి కొద్ది నిమిషాల ముందు కమల ప్రమాణస్వీకారం చేశారు.

Kamala takes oath as America's 49th Vice President
చరిత్ర సృష్టించిన కమల.. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం
author img

By

Published : Jan 20, 2021, 10:13 PM IST

Updated : Jan 20, 2021, 10:44 PM IST

అగ్రరాజ్య 49వ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు భారత సంతతి కమలా హారిస్​. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్రలో నిలిచారు 56ఏళ్ల కమల. ఉపాధ్యక్ష పదవిని ఓ మహిళ చేపట్టడం కూడా ఇదే తొలిసారి.

అధ్యక్షుడిగా జో బైడెన్​ బాధ్యతలు చేపట్టే కొద్ది నిమిషాల ముందు ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు కమల. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్​.. కమల చేత ప్రమాణం చేయించారు.

అంతకుముందు.. తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్​ చేశారు కమల. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తల్లి అని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- అగ్రరాజ్యంలో మెరిసిన భారతీయ కమలం

Last Updated : Jan 20, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.