సాంకేతిక సమస్య కారణంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రయాణిస్తున్న విమానం తిరిగి వెనక్కు వచ్చింది. పర్యటనలో భాగంగా ఆదివారం మెక్సికోకు బయలు దేరిన హారిస్.. 25 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్ని విమానం తిరిగి అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆగింది.
తాను సురక్షితంగా ఉన్నట్లు కమలా హారిస్.. విమానం నుంచి బయటకు వస్తూ మీడియాకు తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తినప్పుడు చిన్న ప్రార్థన చేశానని చెప్పుకొచ్చారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికార ప్రతినిధి సైమోర్ సాండర్స్ తెలిపారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల ఇలా జరిగిందన్నారు. మరో గంటలో ఉపాధ్యక్షురాలు వేరే విమానంలో పర్యటన ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : Vaccine: స్వల్ప సాయం.. పెద్ద వ్యూహం