ETV Bharat / international

'అమెరికా అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదు' - us elections 2020

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమలా హారిస్​ సమర్థవంతమైన నాయకురాలు కాదని విమర్శించారు డొనాల్డ్​ ట్రంప్. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమెపై మాటల దాడికి దిగారు. భవిష్యత్తులో అధ్యక్ష పదవిలో ఓ మహిళను చూడాలని ఉందని, అందుకు తన కూతురు ఇవాంక ట్రంపే సరైన అభ్యర్థి అని అన్నారు.

Kamala Harris 'not competent' to be US president, says Trump
' అమెరికా అధ్యక్ష పదవికి కమల అర్హురాలు కాదు'
author img

By

Published : Aug 29, 2020, 1:08 PM IST

డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​పై విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆమె అర్హురాలు కాదన్నారు. రిపబ్లికన్ల నామినేషన్​ను అధికారికంగా అంగీకరించిన తర్వాత న్యూ హాంప్​షైర్​లో తొలి ర్యాలీ నిర్వహించారు ట్రంప్​. అమెరికా అధ్యక్ష పదవిలో ఓ మహిళను చూడాలని తాను కూడా కోరుకుంటున్నా అని చెప్పారు. అయితే అందుకు సమర్థవంతమైన అభ్యర్థి తన కూతురు, శ్వేతసౌధ సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంపే అన్నారు.

" అమెరికా అధ్యక్ష పదవిలో ఓ మహిళను చూడాలని నేనూ అనుంకుంటున్నాను. అయితే కమలా హారిస్ వంటి వ్యక్తి మాత్రం కానే కాదు. ఆమె సమర్థవంతురాలు కాదు. అధ్యక్ష అభ్యర్థి బరిలో ప్రచారం ఘనంగా ప్రారంభించి ఆ తర్వాత స్వయంగా తప్పుకునే స్థాయికి ఆమె పడిపోయారు. కొన్ని నెలలపాటు ఆమెకే విజయావకాశాలు ఉంటాయని అంతా భావించారు కానీ పరిస్థితి మొత్తం మారిపోయింది. చివరకు ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రాట్లు ఆమెను ఎంపిక చేశారు. "

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు మహిళా అధ్యక్ష అభ్యర్థి అనగానే ఆయన అభిమానులు ఇవాంక ట్రంప్​ అని కేరింతలు వేశారు.

గతేడాది వరకు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు కమలా హారిస్. అనుకున్నంత ప్రజాదరణ రానందు వల్ల పోటీ నుంచి స్వయంగా తప్పుకున్నారు. ఆ తర్వాత జో బైడెన్​ రేసులో దూసుకెళ్లి అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రాట్ల మద్దతు కూడగట్టుకున్నారు. కమలా హారిస్​ను ఆయనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. అయితే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్​ బరిలో ఉంటారని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి: బ్రిటన్​ ప్రధానికి మహిళ లేఖ.. దిల్లీ పోలీసులు పరుగోపరుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.