ETV Bharat / international

అధ్యక్షుడిగా బైడెన్​- కాంగ్రెస్​ ధ్రువీకరణ

జో బైడెన్​ను అధ్యక్షుడిగా ధ్రువీకరించింది అమెరికా కాంగ్రెస్. ఎలక్టార్​ కాలేజీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు.. అధికార బదిలీ ప్రక్రియకు సహకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్​ ఎట్టకేలకు ఒప్పుకున్నారు.

Joint session of US Congress certifies Biden's electoral victory over Trump
అధ్యక్షుడిగా బైడెన్​- కాంగ్రెస్​ ధ్రువీకరణ
author img

By

Published : Jan 7, 2021, 3:07 PM IST

Updated : Jan 7, 2021, 3:18 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. డెమొక్రటిక్​ నేత జో బైడెన్​ను తదుపరి అధ్యక్షుడిగా, కమలా హారిస్​ను ఉపాధ్యక్షురాలిగా అగ్రరాజ్య కాంగ్రెస్​ ధ్రువీకరించింది. ఇక ఈ నెల 20న బైడెన్​, హారిస్​ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించకూడదని నిర్ణయించారు.

అయితే అధ్యక్షుడిగా బైడెన్​ ధ్రువీకరణ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. ఎలక్టార్​ కాలేజీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఊహించని రీతిలో అడ్డంకి ఏర్పడింది. అధ్యక్షుడు ట్రంప్​ మద్దతుదారులు వేలాది మంది.. అగ్రరాజ్య క్యాపిటల్​లోకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. దాదాపు నాలుగు గంటల పాటు నిలిచిపోయిన కాంగ్రెస్​.. పరిస్థితి అదుపులోకి వచ్చాక.. బైడెన్​ను అధ్యక్షుడిగా ధ్రువీకరించింది. బైడెన్​కు 306 ఎలక్టార్​ కాలేజీ ఓట్లు లభించినట్టు సమాచారం.

ట్రంప్​ ఎట్టకేలకు..

కాంగ్రెస్​ సమావేశం అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బదిలీకి సహకరిస్తానని, ప్రక్రియ పద్ధతి ప్రకారం జరుగుతుందని ఎట్టకేలకు వెల్లడించారు.

"అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నేను వ్యతిరేకిస్తున్నా. అయినప్పటికీ అధికార బదిలీ ప్రక్రియ సజావుగా సాగడానికి కృషిచేస్తాను. దీంతో అధ్యక్ష చరిత్రలోనే ఓ గొప్ప పదవీకాలం ముగియనుంది. అమెరికాను తిరిగి గొప్ప స్థాయికి చేర్చేందుకు సాగే మా పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఇదీ చూడండి:- అగ్రరాజ్య ఆర్మీ తొలి సీఐఓగా భారతీయ అమెరికన్​

Last Updated : Jan 7, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.