అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు నిర్వహించే ప్రైమరీల్లో డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఆదివారం ప్యూర్టోరికోలో జరిగిన ఈ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులను ఎదుర్కొన్నారు బైడెన్. ఫలితంగా పార్టీ నుంచి నామినేట్ అయ్యేందుకు బైడెన్‌కు కావల్సినంత బలం సమకూరినట్లైంది. ఇప్పటికే మెజారిటీ ప్రైమరీల్లో గెలిచిన నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది.
వాస్తవానికి ఈ ప్రైమరీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జులై 12కు వాయిదాపడ్డాయి.
ఇదీ చదవండి: బెర్నీ-బైడెన్ భాయిభాయి.. ట్రంప్ భవిష్యత్తు ఏం కానుంది?