ETV Bharat / international

నామినేషన్​ను అధికారికంగా అంగీకరించిన బైడెన్​ - biden nomination news

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి నామినేషన్​ను అధికారికంగా అంగీకరించారు జో బైడెన్​. ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ నాయకత్వంలో అంధకారంలోకి వెళ్లిన అమెరికాను మళ్లీ ప్రకాశింపజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Joe Biden officially accepts Democratic presidential nomination
డెమొక్రాట్ల నామినేషన్​ను అంగీకరించిన బైడెన్​
author img

By

Published : Aug 21, 2020, 10:39 AM IST

అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్​ పార్టీ నామినేషన్​ను అధికారికంగా అంగీకరించారు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్. అనంతరం ప్రసంగిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై విరుచుకుపడ్డారు. అమెరికాను ఆయన అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ప్రజలంతా ఏకమై అగ్రరాజ్యాన్ని చీకటి నుంచి మళ్లీ వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కమలపై ప్రశంసలు..

డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ అమెరికన్​ కమలా హారిస్​పై ప్రశంసల వర్షం కురిపించారు బైడెన్​. ఆమె శక్తమంతమైన గొంతుక అని కొనియాాడారు. హారిస్​తో పాటు కలిసి అమెరికా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చూడండి: చైనా ఆర్మీ వంటశాలల్లో రోబోల నియామకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.