ETV Bharat / international

బైడెన్​ ప్రమాణ స్వీకారం.. ఎప్పుడు? ఎక్కడ? - కమలా హారిస్ అమెరికా

అమెరికా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్​, కమలా హారిస్​ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రతిసారి ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

Biden
బైడెన్​ ప్రమాణ స్వీకారం ఎప్పుడు? ఎక్కడ?
author img

By

Published : Jan 20, 2021, 5:20 AM IST

Updated : Jan 20, 2021, 6:01 AM IST

అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కమలా హారిస్​ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టన్నారు. ఈ పదవిని చేపడుతున్న తొలి నల్లజాతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిసారి వేలాది మంది సమక్షంలో ఘనంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం.. ఈసారి కరోనా, ఇతర భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

ఎప్పుడు?

జో బైడెన్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు దాటగానే (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.30 సమయంలో) ప్రమాణ స్వీకారం చేస్తారు. 127 ఏళ్ల కుటుంబ బైబిలుపై ఆయన ప్రమాణం చేస్తారు.

ఎక్కడ?​

వాషింగ్టన్​లోని అమెరికా కాంగ్రెస్​ భవనం 'క్యాపిటల్ హిల్​' పశ్చిమం వైపు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకను టీవీ ఛానళ్లతో పాటు ట్విట్టర్, ఫేస్​బుక్, యూట్యూబ్​ తదితర సామాజిక మాధ్యమాలూ ప్రసారం చేస్తాయి. ఉదయం 10 గంటలకే ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది.

ఎవరు చేయిస్తారు?

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్​ రాబర్ట్స్.. బైడెన్​తో ప్రమాణం చేయిస్తారు. ఆయన కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​తో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సోనియా సోటోమేయర్​ ప్రమాణం చేయించనున్నారు. ఉపాధ్యక్ష పదవిని తొలిసారి ఒక మహిళ చేపట్టనుండటం విశేషం.

బలగాలే ఎక్కువ

బైడెన్ ప్రమాణం సందర్భంగా భద్రతా సిబ్బంది నుంచి దాడి జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో క్యాపిటల్​ హిల్ వద్ద 25 వేల మంది నేషనల్​ గార్డ్స్​ సిబ్బందిని మోహరించారు. మాజీ అధ్యక్షులు, సెనేటర్లు తదితర వెయ్యి మంది ఆహ్వానితులు మాత్రమే హాజరుకానున్నారు.

శ్వేతసౌధ ప్రవేశం..

ప్రమాణం అనంతరం బైడెన్, కమలా హారిస్​లు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వారు శ్వేతసౌధానికి బయల్దేరతారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లోనూ వర్చువల్​ పరేడ్​లు నిర్వహిస్తారు.

నటుడు టామ్​ హ్యాంక్స్​ నేతృత్వంలో రాత్రి 8.30 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటంది.

లేడి గాగా దినోత్సవం...

ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖ పాప్​ సింగర్​ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెన్సిఫర్​ లోపెజ్, గార్త్​ ట్రూక్​ల ప్రదర్శన ఉంటాయి.

దీని కంటే ముందు..

ప్రమాణ స్వీకారానికి చాలాముందే.. బుధవారం ఉదయమే ట్రంప్​ శ్వేతసౌధాన్ని వీడనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండానే ఆయన ఫ్లోరిడాలోని తన నివాసానికి వెళ్లిపోనున్నారు.

Last Updated : Jan 20, 2021, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.