ETV Bharat / international

ఈ నాటి 'బరాక్​- బైడెన్​' అనుబంధం ఏనాటిదో! - ఒబామా

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు పర్యాయాలు జోబైడెన్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ప్రతి కీలక సమావేశంలో జో ఒబామా నీడవలే ఉండేవారు. అప్పట్లో అమెరికా పత్రికల్లో వీరిద్దరి సమన్వయాన్ని బ్రోమాన్స్‌ (సోదర ప్రేమ)గా వర్ణిస్తూ కుప్పలు తెప్పలుగా ఆర్టికల్స్‌ వచ్చేవి. ఇప్పుడు బైడెన్​ అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా వారి అనుబంధం గురించి మరోసారా చూద్దాం.

Joe Biden and Barack Obama share a unique relation
ఈ నాటి 'బరాక్​-బైడెన్​' అనుబంధం ఏనాటిదో!
author img

By

Published : Nov 8, 2020, 5:31 AM IST

'"మా సోదర ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి ఇంటర్నెట్‌కు ఇదే చివరి అవకాశం" అని ఒబామా అనగానే ఆ పక్కనే ఉన్న జోబైడెన్‌ పగలబడి నవ్వుతూ ఆయన భుజం తట్టారు. ఇది అమెరికా 44వ అధ్యక్షుడు ఒబామా.. నాటి ఉపాధ్యక్షుడు జో బైడెన్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. 2017 జనవరిలో జోబైడెన్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం ది 'ప్రెసిడెంట్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడం' అందించే సభలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా నేను చివరి సారి ప్రెసిడెన్షియల్‌ పతకాన్ని అందిస్తున్నా అనగానే బైడెన్‌ వెనక్కి తిరిగి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకొన్నారు. ఇది వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.

Joe Biden and Barack Obama share a unique relation
అత్యంత ఆప్తులు

వీరిద్దరి అనుబంధం విచిత్రంగా మొదలైంది. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని బైడెన్‌ నిర్ణయించుకొన్నారు. అప్పటికే ఈయనకు సెనెటర్‌గా దాదాపు 35 ఏళ్ల అనుభవం ఉంది. బైడెన్‌కు పోటీగా మరో సీనియర్‌ క్రిస్‌ డోడ్ కూడా రంగంలోకి దిగారు. అప్పటికే యువకుడైన బరాక్‌ ఒబామా ఇల్లినాయిస్‌ సెనెటర్‌గా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయన కూడా బరిలోకి దిగారు. ఐయోవాలో నిర్వహించిన కాకస్‌లో బైడెన్‌కు ఒకశాతం మాత్రం మద్దతు లభించింది. దీంతో ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత రేసు నుంచి వైదొలగారు. బరాక్‌ రేసులో దూసుకెళ్లి డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఉపాధ్యక్షుడిగా బైడెన్‌ను ఎన్నుకొన్నారు. అలా వీరి బంధం మొదలైంది.

జో-బరాక్​ మైత్రి

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు పర్యాయాలు జోబైడెన్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ప్రతి కీలక సమావేశంలో జో ఒబామా నీడవలే ఉండేవారు. ఆయన తెరపైకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అప్పట్లో అమెరికా పత్రికల్లో వీరిద్దరి సమన్వయాన్ని బ్రోమాన్స్‌ (సోదర ప్రేమ)గా వర్ణిస్తూ కుప్పలు తెప్పలుగా ఆర్టికల్స్‌ వచ్చేవి. అప్పట్లో అమెరికా తొలి మహిళ మిషెల్‌ నేతృత్వంలో నిర్వహించిన 'లెట్స్‌ మూవ్' ప్రచారం కోసం వీరిద్దరు కలిసి ఓ వీడియోలో కూడా నటించారు. అది అప్పట్లో సంచలనం అయింది. ఒబామా పుట్టిన రోజు సందర్భంగా జో బైడెన్‌ ఒక ఫొటో షేర్‌ చేశారు. దీనిలో జో-బరాక్‌ అని రాసి ఉన్న బ్రాస్‌లెట్‌ ఉంది.

అధ్యక్ష-ఉపాధ్యక్షులు

ఒబామా-బైడెన్‌ల బంధం ఆఫీస్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకునేంతగా గాఢంగా ఉంది. ఈ విషయాన్ని ఒక సారి బైడెన్‌ స్వయంగా ఎన్‌బీసీ ఛానెల్‌కు చెప్పారు. "నేను ఒబామాను ఇష్టపడను.. ప్రేమిస్తాను. బ్యూ(బైడెన్‌ కుమారుడు) చనిపోవడానికి ముందు అనారోగ్యానికి గురైయ్యాడు. అప్పుడు బరాక్‌ నాకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు" అని గుర్తుకు తెచ్చుకొన్నారు. ఒబామా సతీమణి మిషెల్‌, బైడెన్‌ సతీమణి జిల్‌లు సన్నిహత మిత్రురాళ్లు. అలానే బైడెన్‌ మనవరాళ్లు.. ఒబామా కుమార్తెలకు మంచి దోస్తీ కుదిరింది. వృత్తిపరమైన జీవితానికి దూరంగా వీరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. శ్వేతసౌధంలో అధ్యక్షుడికి.. ఉపాధ్యక్షుడికి ఈ స్థాయిలో సంబంధాలు అత్యంత అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఒబామా తానే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడినట్లు భావించి ఈ ఎన్నికల్లో బైడెన్‌ కోసం ప్రచారం చేశారు.

శ్వేతసౌధంలో

జో-బరాక్‌.. స్నేహం

ప్రత్యర్థులుగా మొదలై ప్రాణ స్నేహితులుగా!

బరాక్​-బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.