ETV Bharat / international

'కొత్త వీసా రూల్స్​ను కోర్టు కొట్టేయడం ఖాయం' - అమెరికా అధ్యక్షుడు

విదేశీ విద్యార్థులను అమెరికా నుంచి పంపించేలా ట్రంప్ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో చాలా మంది విద్యార్థుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. అయితే పాలసీకి సంబంధించిన నియమాలు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు కాబట్టి విద్యార్థులంతా ప్రశాంతంగా ఉండాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. హార్వర్ట్​ వంటి సంస్థల న్యాయ పోరాటం ఫలించే అవకాశం ఉందని చెబుతున్నారు.

International students uncertain about their future in US, Immigration lawyer says ICE policy could be blocked
'విద్యార్థులు భయం వద్దు- న్యాయ పోరాటం ఫలిస్తుంది!'
author img

By

Published : Jul 14, 2020, 3:57 PM IST

ఆన్​లైన్ తరగతులకు హాజరయ్యే వాళ్లు దేశం నుంచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా భయాలతో రెగ్యులర్ తరగతులకు హాజరుకాలేక, చదువును మధ్యలో వదిలిరాలేక నానా అవస్థలు పడుతున్నారు. వీసా స్టేటస్​ ఎప్పుడు మారిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి-'అమెరికా వెళ్లే అవకాశం పోయిందని ఆందోళన వద్దు'

సిన్సినాటి విశ్వవిద్యాలయానికి చెందిన బయోఇంజినీరింగ్ విద్యార్థి వర్ధ అగర్వాల్ సైతం తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. గత సెమిస్టర్​లో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం తొలగించడం అన్యాయమని చెబుతున్నారు.

'విద్యార్థులు భయం వద్దు- న్యాయ పోరాటం ఫలిస్తుంది!'

వీసా రాజకీయమే!

ఇమ్మిగ్రేషన్ లాయర్ మంజునాథ్ గోకరే మాత్రం ఈ పాలసీలను రాజకీయ ఎత్తుగడలుగా అభివర్ణించారు. యూనివర్సిటీలను బలవంతంగా ప్రారంభించడానికి, వలసలను తగ్గించడానికి ట్రంప్​ సర్కార్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలని పేర్కొన్నారు.

ఆందోళన వద్దు

ఫెడరల్ రిజిస్టర్​లో నూతన పాలసీ విషయం ఇంకా పొందుపర్చలేదు కాబట్టి విద్యార్థులంతా ప్రశాంతంగా ఉండాలని భరోసా ఇస్తున్నారు మంజునాథ్. ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పాలసీలను రద్దు చేసేలా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రకటన

ఆన్​లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు వచ్చే సెమిస్టర్​ కోసం ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలని.. లేదంటే అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.