ETV Bharat / international

సూది మందుతోనే కరోనా వైరస్​కు చెక్! - కరోనా వ్యాక్సిన్ తయారీ

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ విజృంభణకు అడ్డుకట్ట వేయాలంటే టీకానే అత్యుత్తమ మార్గమని వైద్యులు అంటున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా టీకా కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. టీకా మందు కరోనాతో ఎలా పోరాడుతుంది? టీకా కోసం ఫార్మా సంస్థల పరిశోధనలు ఎలా సాగుతున్నాయి?

injected vaccine will help us to kill Corona
కరోనా నివారణకు సూది మందు
author img

By

Published : May 7, 2020, 12:30 PM IST

కరోనా వైరస్‌ను కనుమరుగు చేయడానికి మన ఎదుట ఉన్న అత్యుత్తమ మార్గం టీకానే. దీన్ని కనుగొనడానికి సంప్రదాయ, వినూత్న మార్గాల్లో ప్రయత్నాలు మొదలయ్యాయి. మానవాళిని ఈ మహమ్మారి నుంచి కాపాడటానికి శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఫార్మా సంస్థలు యుద్ధప్రాతిపదికన కృషిచేస్తున్నాయి. అవకాశం ఉన్న ఏ మార్గాన్నీ వదిలిపెట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 96కుపైగా టీకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు సంస్థలు టీకాల సురక్షితను పరీక్షించటానికి ప్రయోగాలు ఆరంభించాయి. మరికొన్ని సంస్థలు జంతువులపై ప్రయోగ పరీక్షలు మొదలుపెట్టాయి. మానవాళికి ప్రాణభిక్ష పెట్టే ఈ టీకాలను ఎలా రూపొందిస్తారు? అవి ఎలా పనిచేస్తాయి? అనేవి కీలకాంశాలు.

వైరస్‌ ఆధారిత

కనీసం ఏడు బృందాలు అచేతనమైన లేదా బలహీన పరచిన వైరస్‌లతో టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మీజిల్స్‌, పోలియో టీకాల వంటివన్నీ ఇలా రూపొందించినవే. ఈ రకం టీకాలు ఎంతవరకు సురక్షితమో తేలాల్సి ఉంది. బీజింగ్‌లోని సైనోవాక్‌ బయోటెక్‌ సంస్థ అచేతన వైరస్‌తో చేసిన టీకాను మనుషులపై పరీక్షిస్తోంది.

బలహీన వైరస్‌: ఈ టీకాల తయారీ కోసం వైరస్‌ను బలహీన పరుస్తారు. ఈ క్రమంలో అందులో జన్యుమార్పులు తలెత్తి అంతగా జబ్బు కలిగించలేని స్థితికి చేరుకుంటాయి. న్యూయార్క్‌, ఫార్మింగ్‌డేల్‌లోని ‘కోడజెనిక్స్‌’ అనే సంస్థ భారత్‌లోని ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’తో కలిసి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. జన్యు సంకేతాలను మార్చి వైరస్‌ను బలహీనపరచటం, వాటి ప్రొటీన్ల సామర్థ్యాన్ని తగ్గించటం ఇందులోని ముఖ్యాంశం.

అచేతన వైరస్‌

ఇలాంటి టీకాల తయారీలో వైరస్‌ను ఫార్మల్‌డిహైడ్‌ వంటి రసాయనాలు లేదా వేడితో ఇన్‌ఫెక్షన్‌ కలిగించని విధంగా మారుస్తారు. ఇలా చేయటానికి ఇన్‌ఫెక్షన్‌ కలిగించే వైరస్‌లు పెద్దమొత్తంలో అవసరమవుతాయి.

  • సర్వసాధారణంగా టీకాలను అభివృద్ధి చేసే విధానం ఇది. భారీగా ఉత్పత్తి చేయడానికి వనరులు ఉన్నాయి.
  • సురక్షిత ప్రమాణాలను అందుకొని తీరాలి. అచేతన వైరస్‌లతో చేసే టీకాల ఉత్పత్తి కొంచెం కష్టంతో కూడుకొన్నది.
  • అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ల సంఖ్య: 8

న్యూక్లిక్‌ ఆమ్లంతో..

రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించే కరోనా వైరస్‌ ప్రొటీన్‌ కోసం జన్యు సంకేతాలను(డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ రూపాల్లో) వినియోగించుకోవటంపై కనీసం 20 బృందాలు పనిచేస్తున్నాయి. మానవుల కణాల్లోకి న్యూక్లిక్‌ ఆమ్లాన్ని జొప్పిస్తారు. ఇలాంటి టీకాలు చాలావరకు వైరస్‌ ముళ్ల ప్రొటీన్‌తోనే సంక్షేపితమై ఉంటాయి. వీటిని రూపొందించటానికి వైరస్‌లు అవసరం లేదు. జన్యు పదార్థముంటే చాలు. కానీ ఇవి నిరూపితమైనవి కావు.

  • కణంలోకి డీఎన్‌ఏ మరింత ఎక్కువగా చేరుకునేలా ఎలక్ట్రోపోరటేషన్‌ ప్రక్రియ ద్వారా పైపొరకు రంధ్రాలు చేస్తారు.
  • ఆర్‌ఎన్‌ఏ చుట్టూ కొవ్వు పొర రక్షణగా ఉంటుంది. కణంలోకి ప్రవేశించగలిగేది ఇదే.
  • న్యూక్లిక్‌ ఆమ్లాల ఆధారంగా చేసే టీకాలు సురక్షితమైనవి. వేగంగా అభివృద్ధి చేయొచ్చు.
  • రోగ నిరోధక ప్రతిస్పందనను అదుపు చేయాలి.
  • అభివృద్ధి చేస్తున్న టీకాల సంఖ్య: 25

వైరల్‌- రోగవాహక టీకాలు

వైరల్‌- రోగవాహక టీకాలను తయారుచేస్తున్నట్టు 25 సంస్థలు చెబుతున్నాయి. మన ఒంట్లో కరోనా వైరస్‌ ప్రొటీన్లను పుట్టించేలా మీజిల్స్‌ లేదా అడినోవైరస్‌ లాంటి వాటిని జన్యుపరంగా మార్చటం ఇందులో కీలకాంశం. ఈ వైరస్‌లను బలహీనపరుస్తారు కాబట్టి జబ్బును కలగజేయవు. వీటిలో రెండు రకాలున్నాయి.

వృద్ధిచెందే వైరల్‌ రోగ వాహకం

ఇటీవల అభివృద్ధి చేసిన ఎబోలా టీకా దీనికి మంచి ఉదాహరణ. దీనిలోని వైరస్‌ కణాల్లో వృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాలు సురక్షితమైనవి. కాకపోతే ఇప్పటికే వీటిల్లోని వైరస్‌లను ఎదుర్కొనే శక్తి మన రోగనిరోధక వ్యవస్థకు ఉంటే టీకాల సామర్థ్యం తగ్గుతుంది.

వృద్ధిచెందని వైరల్‌ రోగ వాహకం

అనుమతి పొందిన టీకాలేవీ ఇలాంటి పద్ధతిలో తయారైనవి కావు. కానీ జన్యు చికిత్సలో దీన్ని చాలాకాలంగా వినియోగిస్తున్నారు. రోగ నిరోధక సామర్థ్యం ఎక్కువ కాలం పనిచేయాలంటే బూస్టర్‌ మోతాదులు ఇవ్వాల్సి ఉంటుంది.

  • ఎబోలా టీకా అభివృద్ధి అనుభం ఉండటం వల్ల తయారీ నిపుణుల కొరత రాదు.
  • వీటిలో వృద్ధి చెందే వైరల్‌ వాహక రకం టీకాల నుంచి వచ్చే రోగనిరోధక శక్తి తక్కువ కాలం ఉంటుంది.
  • అభివృద్ధి చేస్తున్న వాటి సంఖ్య: 25

ప్రొటీన్‌ ఆధారితమైనవి

కరోనా వైరస్‌ ప్రొటీన్లను నేరుగా ఒంట్లోకి ప్రవేశపెట్టొచ్చని చాలామంది పరిశోధకులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ ఉపరితల కవచాన్ని తలపించేలా దాని ప్రొటీన్‌ భాగాలను లేదా ప్రొటీన్‌ కవచాలనూ ఇందుకు వినియోగించుకోవచ్చు.

ప్రొటీన్‌ భాగాలు

వైరల్‌ ప్రొటీన్‌ భాగాలతో 32 సంస్థలు టీకాలు తయారు చేస్తున్నాయి. ఇవి చాలావరకు వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ లేదా ఏసీఈ2 గ్రాహకానికి అతుక్కునేలా చేసే కీలక భాగాలపై దృష్టి సారించాయి. ఇవి కోతుల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా చేస్తున్నట్టు బయటపడింది మనుషులపై పరీక్షించలేదు. ఇవి పనిచేయాలంటే రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించే వాటిని జోడించాల్సి ఉంటుంది. టీకాలు పలుమార్లు ఇవ్వాల్సి ఉంటుంది కూడా.

వైరస్‌ లాంటి భాగాలు

ఖాళీ వైరస్‌ కవచాలు కరోనా వైరస్‌ ఆకారాన్ని తలపిస్తాయి. వీటిల్లో జన్యు పదార్థమేదీ ఉండదు కాబట్టి జబ్బును కలగజేయవు. వైరస్‌ను పోలిన భాగాల(వీఎల్‌పీ) టీకాల మీద ఐదు సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి గానీ వీటిని ఉత్పత్తి చేయటం కష్టం.

  • ఈ టీకాలను తయారు చేయడం, ఉత్పత్తి చేయడం తేలిక.
  • వీటిని ఇప్పటి వరకు మనుషులపై ప్రయోగించలేదు.
  • అభివృద్ధి చేస్తున్న టీకాల సంఖ్య: 38

పరిశోధనలు ఇలా..

టీకాలన్నింటి లక్ష్యం- యాంటీబాడీల పుట్టుకను ప్రేరేపించే యాంటీజెన్‌ ప్రభావానికి శరీరాన్ని గురిచేయటం. ఈ యాంటీజెన్‌ జబ్బును కలగజేయదు. వైరస్‌ను అడ్డుకునే రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.వైరస్‌ను ఎదుర్కోవటానికి కనీసం 4 రకాల సాంకేతికతలతో 8 వైవిధ్య టీకాల పరీక్షలు జరుగుతున్నాయి.

వైరస్‌ ఉపరితలాన ముళ్లలాంటి ప్రొటీన్లుంటాయి. కళ్లు, ముక్కు, నోటి ద్వారానే ఇది మన కణాలపైన ఏసీఈ2 గ్రాహకాలకు అంటుకుపోతుంది. తర్వాత కణంలోకి ప్రవేశిస్తుంది. అప్పట్నుంచి అవి వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ సూచనల ప్రకారమే నడుచుకుంటాయి. మరిన్ని వైరస్‌లను సృష్టించటం ఆరంభిస్తాయి.

corona Infection map
వైరస్ ఇన్​ఫెక్షన్​​ మ్యాప్

రోగ నిరోధక ప్రతిస్పందన..

  1. పరాయి ప్రొటీన్‌, యాంటీజెన్‌ కూడిన ప్రత్యేక కణాలు వైరస్‌ను మింగేస్తాయి. టి సహాయ కణాలు ప్రేరేపితమయ్యేలా చేస్తాయి.
  2. సహాయ ‘టి కణాలు’ ఇతర రోగ నిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. ఇతర కణాలకు వైరస్‌ సోకకుండా చూడటానికి ‘బి కణాలు’ యాంటీబాడీలను పుట్టిస్తాయి, తుదముట్టించాల్సిన వైరస్‌ల మీద గుర్తువేస్తాయి. విషపూరిత ‘టి కణాలు’ ఇన్‌ఫెక్షన్‌ కణాలను నిర్మూలిస్తాయి.
  3. బి, టి కణాలు వైరస్‌ను గుర్తుపెట్టుకుంటాయి. దాన్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని కల్పించి చాలాకాలం పాటు శరీరాన్ని కాపాడతాయి. తిరిగి ఎప్పుడైనా వైరస్‌ దాడిచేస్తే దాని పని పట్టటానికి సిద్ధంగా ఉంటాయి.

ఇదీ చూడండి:కరోనా కాలంలో భారత్​ రికార్డ్- 2 కోట్ల శిశువులు జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.