ETV Bharat / bharat

కరోనా కాలంలో భారత్​ రికార్డ్- 2 కోట్ల శిశువులు జననం - యూనిసెఫ్​

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్​ మధ్య కాలంలో అత్యధికంగా భారత్​లో 2కోట్లకుపైగా జననాలు ఉంటాయని యూనిసెఫ్​ అంచనా వేసింది. డబ్ల్యూహెచ్​ఓ.. కరోనా వైరస్​ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పటి నుంచి 9నెలల వరకు యూనిసెఫ్​ వేసిన అంచనాల్లో ఈ విషయం తేలింది.

At 20.1 million, India expected to have highest births since COVID-19 declared as pandemic: UNICEF
దేశవ్యాప్తంగా 9నెలల్లో 2కోట్లకుపైగా జననాలు
author img

By

Published : May 7, 2020, 11:48 AM IST

Updated : May 7, 2020, 11:58 AM IST

భారత్​లో 9నెలల కాలంలో(మార్చి11-డిసెంబర్16​) అత్యధికంగా 2కోట్లకుపైగా శిశువులు జన్మిస్తారని అంచనా వేసింది యూనిసెఫ్​. కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన మార్చి 11 నుంచి 9 నెలల పాటు జరగబోయే ప్రసవాలపై ఈమేరకు నివేదిక రూపొందించింది.

అయితే కరోనా వైరస్​ రూపంలో ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తల్లీబిడ్డలకు ఆరోగ్య సేవలు అందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించింది యూనిసెఫ్​.

ప్రపంచవ్యాప్తంగా...

ఈ 9నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 60 లక్షల​ మంది జన్మిస్తారని అంచనా. అత్యధికంగా భారత్​లో 20.1 మిలియన్​ మంది ప్రసవిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(13.5మిలియన్​), నైజీరియా(6.4మిలియన్​), పాకిస్థాన్​(5 మిలియన్​), ఇండోనేషియా(4మిలియన్​) ఉన్నాయి.

అయితే ఈ దేశాల్లో నవజాత శిశువు మరణాల రేటు ఎక్కువగా ఉందని.. కరోనా వైరస్​ పరిస్థితుల వల్ల ఆ రేటు ఇంకా పెరిగే ప్రమాదముందని పేర్కొంది యూనిసెఫ్.

ఓ మహిళ.. పూర్తి గర్భం సగటు 9నెలలు(39-40వారాలు)గా ఉంటుంది. ఈ నివేదిక రూపొందించడానికి యూనిసెఫ్​ 40వారాలుగా పరిగణించింది.

ప్రపంచవ్యాప్తంగా గర్భిణీలు వైరస్​ బారిన పడటం లేదని ఆధారాలున్నప్పటికీ... తల్లీబిడ్డల క్షేమం కోసం అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది యూనిసెఫ్​.

ఇదీ చూడండి:- మద్యం జోరు.. మూడోరోజూ రికార్డు అమ్మకాలు

Last Updated : May 7, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.