ETV Bharat / international

ట్రంప్​ 'వీసా దెబ్బ'తో దిక్కుతోచని స్థితిలో మనోళ్లు!

"ఆన్​లైన్​ క్లాసుల ద్వారా విద్యాభ్యాసం సాగిస్తున్న విదేశీయులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందే"... డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ తాజా ఆదేశాలివి. ఈ కొత్త నిబంధనలతో మనోళ్లపై ప్రభావమెంత? ఉన్నత చదువులు, మెరుగైన కొలువులపై కోటి ఆశలతో అగ్రరాజ్యానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ట్రంప్ కొత్త నిబంధనల గురించి వారు ఏమనుకుంటున్నారు?

Indian students concerned about deportation,
'బహిష్కరణ' సహా ఆ అంశాలపై భారతీయ విద్యార్థుల్లో ఆందోళన
author img

By

Published : Jul 12, 2020, 4:26 PM IST

అగ్రరాజ్యం నుంచి బలవంతంగా స్వదేశానికి పంపేస్తారన్న ఆందోళన... విద్య కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు ఎలా చెల్లించాలో తెలియని గందరగోళం... కరోనా సోకుతుందన్న భయం... సెమిస్టర్​ మధ్యలోనే చదువు ఆపేయాల్సి వస్తుందన్న దిగులు... కళాశాలకు ఎప్పటికీ తిరుగురాలేమన్న బెంగ... అమెరికా చదువు కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సంక్లిష్ట మానసిక స్థితి ఇది. ఇందుకు ప్రధాన కారణం... డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన నూతన వలస విధానం.

కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సెమిస్టర్​ను కొనసాగించేందుకు విశ్వవిద్యాలయాలు ఆన్​లైన్​ తరగతులు మాత్రమే నిర్వహిస్తే... విదేశీ విద్యార్థలు దేశం విడిచి వెళ్లవలసి ఉంటుందని లేదా బహిష్కరణకు గురవుతారని అమెరికా ఇమ్మిగ్రేషన్​ అథారిటీ ప్రకటించింది. వేలాది మంది భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే ఈ కొత్త నిబంధనలపై ఇప్పటికే న్యాయపోరాటం ప్రారంభమైంది. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా హార్వర్డ్​ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఎంఐటీ), జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించాయి. అందుకు ప్రిన్స్​టన్​, స్టాన్​ఫోర్డ్​, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు సహా మరికొన్ని మద్దతు పలికాయి.

దిల్లీ దౌత్యం ఫలించేనా?

వీసా నిబంధనలపై అమెరికా ప్రభుత్వం మెత్తబడేలా చేసేందుకు భారత ప్రభుత్వమూ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. వారం రోజుల క్రితం.. అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డేవిడ్​ హేల్​తో ఇదే అంశంపై చర్చించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. ఇరు దేశాల విద్యార్థుల ప్రయోజనాలు, ప్రజా సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలపై పునరాలోచన చేయాలని కోరారు.

విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన

వీసా కొత్త నిబంధనల్లో మార్పు కోసం న్యాయపరంగా, రాజకీయపరంగా ప్రయత్నాలు జరుగుతున్నా... తుది ఫలితం ఎలా ఉంటుందోనని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

" దీర్ఘకాలిక ప్రణాళికతో అమెరికా వచ్చిన విదేశీ విద్యార్థులకు ఇది పెద్ద దెబ్బ. కరోనాతో క్యాంపస్​ మూసి వేసినప్పటికీ ఇక్కడే ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లాలనుకోవట్లేదు. వేరువేరు టైమ్​ జోన్స్​ కావటం వల్ల ఆన్​లైన్​ క్లాసుల్లో గందరగోళం ఏర్పడుతుంది. కానీ, అకస్మాత్తుగా నేను ఇక్కడ ఉండటం చట్టపరంగా చెల్లకుండా పోయింది. నా సెమిస్టర్​, నా విద్యారుణాలు, ట్యూషన్ ఫీజు కోసం యూనివర్సిటీలో నేను చేసే పని పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతే.. ఎప్పుడైనా తిరిగి రాగలుగుతానా? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం లేదు.

- శోభన ముఖర్జీ, డ్యూక్​ విశ్వవిద్యాలయం విద్యార్థిని

"బోస్టన్​కు నేకు జనవరిలోనే వచ్చాను. ప్రస్తుతం నా యూనివర్సిటీ ఆన్​లైన్​లోనే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. అప్పుడు ఏమి జరుగుతుంది? ఇక్కడ నేను ఉండటం చట్ట విరుద్ధం అవుతుందా?" అని అనుమానం వ్యక్తంచేశారు మరో భారతీయ విద్యార్థి కోశా ఠాకూర్​.

"కరోనా సంక్షోభం సమయంలో విద్యార్థులను దేశం విడిచి వెళ్లమనటం వారి క్రూరత్వాన్ని సూచిస్తోంది. చాలా మంది విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కొందరు తమ వీసా స్టేటస్​ను కాపాడుకునేందుకు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. అమెరికా విశ్వవిద్యాలయంలో చదువుతూ.. వారి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తున్నప్పుడు విద్యార్థులు ఇక్కడ ఉండటం ఎవరినైనా ఎలా ప్రభావితం చేస్తుంది?

- వత్సల థాపర్​, భారతీయ విద్యార్థి.

ఇటీవలి స్టూడెంట్స్​, విజిటర్స్​ ఎక్స్చేంజి ప్రోగ్రాం (ఎస్​ఈవీపీ) నివేదిక ప్రకారం.. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఈ ఏడాది జనవరిలో సుమారు 1,94,556 మంది భారతీయ విద్యార్థులు చేరారు.

ఇదీ చూడండి: అమెరికాలో విదేశీ విద్యార్థుల పాట్లు- హార్వర్డ్ న్యాయ పోరు

'కొత్త వీసా రూల్స్​పై ట్రంప్​ సర్కార్​తో కేంద్రం చర్చలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.