ETV Bharat / international

నాలుగు రకాల డ్రగ్స్​తో కరోనాకు చికిత్స! - us latest news

నాలుగు రకాల డ్రగ్స్ ద్వారా కరోనా వైరస్​ను నియంత్రించవచ్చని తెలిపారు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్తలు. వైరస్​ను నిలువరించగల సామర్థ్యం వీటికి ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు.

four possible drugs to treat COVID-19
నాలుగు రకాల డ్రగ్స్​తో కరోనాకు చికిత్స!
author img

By

Published : May 5, 2020, 7:23 PM IST

కరోనా చికిత్సకు నాలుగు రకాల డ్రగ్స్ ప్రభావం చూపిస్తున్నాయని అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఎబోలా చికిత్సకు ఉపయోగించిన రెమ్​డెసివిర్​ సహా మరో మూడు యాంటివైరల్​ డ్రగ్స్​.. కరోనాను నిలువరిస్తున్నట్లు చెప్పారు.

అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్​ మిస్సోరిలో అసోసియేట్ ఫ్రొఫెసర్​ కమలేంద్ర సింగ్​ అతని బృందంతో కలిసి ఈ నాలుగు డ్రగ్స్​పై పరిశోధనలు జరిపారు. వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందని కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్​ను ఇవి నియంత్రిస్తున్నట్లు తేల్చారు.

రెమ్​డెసివిర్​, 5-ఫ్లోరారసిల్​, రిబవిరిన్, ఫెవిపిరావిర్​ యాంటి డ్రగ్స్ కరోనా వైరస్ జన్యువులు వృద్ధి కాకుండా నిలువరిస్తున్నట్లు పాథోజెన్స్​ జర్నల్​లో అధ్యయనం ప్రచురితమైంది.

వైరస్​ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో సాధ్యమైనంత త్వరగా చికిత్స కనుగొనడం తమ బాధ్యత అని చెబుతున్నారు సింగ్​. ఈ డ్రగ్స్​ వినియోగంపై పరిమితులు ఉన్నందున మరింత అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రోగులపై పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఇవి ఎంతమేర ప్రభావం చూపుతున్నాయో ఓ అంచనాకు రావచ్చని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.