అమెరికా న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బాధితుడు ఓ ఫార్మా సంస్థకు సీఈఓగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే?
న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరో ప్రాంతానికి చెందిన శ్రీరంగ అరవపల్లి(54) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఓ క్లబ్లో కాసినో ఆట ముగించుకుని దాదాపు 10 వేల డాలర్లతో ఇంటికి బయల్దేరారు. ఆ డబ్బును దొంగిలించాలని పన్నాగం పన్నిన ఓ దుండగుడు.. శ్రీరంగను వెంబడించాడు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం శ్రీరంగను ఫాలో అయినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీరంగ.. ఇంట్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో దుండగుడు అతడిపై కాల్పులు జరిపినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు జెకాయ్ రీడ్ జాన్‌ను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: Afghanistan news: మా డబ్బులు మాకివ్వండి: తాలిబన్ సర్కార్