ETV Bharat / international

'కరోనా డ్రగ్​ ఛాలెంజ్' విజేతగా తెలుగమ్మాయి - కొవిడ్​ చికిత్స అమెరికా ఛాలెంజ్​

యంగ్​ సైంటిస్ట్​ ఛాలెంజ్​లో పాల్గొన్న 14ఏళ్ల భారతీయ అమెరికన్​కు 25వేల డాలర్ల నగదు బహుమతి లభించింది. ఆమె ఆవిష్కరణ.. కరోనాకు సమర్థమైన చికిత్సను కనుగొనే విధంగా ఉంది.

Indian-American teen wins USD 25,000 for work on potential COVID-19 treatment
ఆ ఆవిష్కరణతో భారతీయ అమెరికన్​కు రూ.18 లక్షల బహుమతి
author img

By

Published : Oct 19, 2020, 2:43 PM IST

కరోనాకు సమర్థమైన చికిత్స అందించే విధంగా సరికొత్త ఆవిష్కరణ చేసిన 14 ఏళ్ల భారతీయ అమెరికన్​ అమ్మాయి.. ఓ ఛాలెంజ్​లో విజయం సాధించింది. 25వేల డాలర్ల(రూ. 18.34లక్షలు) నగదు బహుమతిగా అందుకుంది.

టెక్సాస్​లోని ఫ్రిస్కోలో 8వ తరగతి చదువుతున్న అనిక చేబ్రోలు.. 3ఎమ్​ యంగ్​ సైంటిస్ట్​ ఛాలెంజ్​లో విజేతగా నిలిచింది. ఇన్​-సిలికో ప్రక్రియ ద్వారా.. సార్స్​-కొవి2 ప్రోటీన్లతో పాటు ఉండే అణువులను కనుగొనేందుకు ఓ డ్రగ్​ను ఆవిష్కరించింది. కరోనాకు చికిత్సను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రయోగం చేపట్టింది అనిక.

3ఎమ్​ అనేది అమెరికా మిన్నెసొటలోని ఓ తయారీ సంస్థ. ఈ ఏడాది ఛాలెంజ్​లో అనికతో పాటు మొత్తం 10మంది తుది దశకు చేరుకున్నారు. ఫైనల్​ రౌండ్​లో శాస్త్రవేత్త డా. మెహ్​పూజా అలి ఆధ్వర్యంలో పనిచేసింది అనిక. ఫలితంగా ఆమె ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. నగదు బహుమతి, 3ఎమ్​ మెంటర్​షిప్ దక్కాయి.

సొంత జీవితంలో..

స్వీయ జీవితం నుంచే స్ఫూర్తి పొంది ఈ ప్రయోగం చేపట్టింది అనిక. గతేడాది ఆమె ఫ్లూ వ్యాధి బారినపడింది. చాలా రోజుల తర్వాత కోలుకుంది. అనంతరం అలాంటి వ్యాధులకు నివారణను కనుక్కోవాలని నిర్ణయించుకుంది. 3ఎమ్​ శాస్త్రవేత్తల సహాయంతో తన కలను నెరవేర్చుకుంటానని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ప్యాకేజ్​ ఫుడ్​పై కరోనా ఆనవాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.