ETV Bharat / international

చంద్రునిపై కాలుమోపనున్న భారతీయ అమెరికన్! - Artemis program

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా).. చంద్రుడ్ని చేరేందుకు ఎంపిక చేసిన వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి చోటు దక్కించుకున్నారు. ఈ మిషన్​ కోసం మొత్తం 18 మంది వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణనిస్తోంది నాసా.

Indian-American astronaut among 18 in NASA's manned Moon mission
చంద్రునిపై కాలుమోపే వ్యక్తుల్లో భారతీయ అమెరికన్​కు చోటు
author img

By

Published : Dec 11, 2020, 11:26 AM IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చంద్రుడిపై కాలు మోపేందుకు శిక్షణనిచ్చే 18 మంది వ్యోమగాముల్లో భారతీయ-అమెరికన్​ చోటు దక్కించుకున్నారు. యూఎస్​ ఎయిర్​ఫోర్స్​ కల్నల్​ రాజా జోన్​ ఉర్పుతూర్​ చారీకి ఈ అవకాశం లభించింది.

ఇదీ చదవండి: చంద్రునిపై దిగే తొలి మహిళ ఈ 9 మందిలో ఎవరు?

43 ఏళ్ల చారీ.. యూఎస్​​ ఎయిర్​ఫోర్స్ అకాడమీ, మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్​ నావల్​ టెస్ట్​ పైలట్​ స్కూల్​లో గ్రాడ్యుయేషన్​ చేశారు. 2017లో నాసా ద్వారా వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యారు. తర్ఫీదు కాలం పూర్తవ్వడం వల్ల.. మిషన్​కు అర్హత సాధించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తి చారీ కావడం విశేషం.

2024 నాటికి ఆర్టెమిస్​ మిషన్​ ద్వారా జాబిల్లిని చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది నాసా. ఈ ప్రయోగానికి ఎంపికైన వ్యోమగాముల బృందాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​.. జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో బుధవారం పరిచయం చేశారు.

ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రానికి క్రిస్మస్​ బహుమతులు​ పంపిన స్పేస్​ఎక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.