ETV Bharat / international

కరోనాలోనూ భారత్​కు భారీగా 'ప్రవాసీల సొమ్ములు'

2020లో.. విదేశాల్లోని ప్రవాసుల నుంచి భారత్ 83 బిలియన్ డాలర్లను అందుకుందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇది 2019తో పోలిస్తే 0.2శాతం తక్కువ అయినప్పటికీ.. ప్రపంచంలో అత్యధిక విదేశీ ప్రవాసుల సొమ్మును అందుకుంటున్న దేశాల్లో భారత్ తొలిస్థానాన్ని పదిలం చేసుకుంది. చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

author img

By

Published : May 13, 2021, 10:57 AM IST

world
విదేశాల నుంచి భారత్​కు 83 బిలియన్ డాలర్లు

ప్రపంచ ఆర్థికాన్ని కరోనా మహమ్మారి కుదిపేసిన సమయంలోనూ భారత్​కు విదేశాల నుంచి ప్రవాసీలు పంపే సొమ్ము పెద్దగా తగ్గలేదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. విదేశాల్లోని ప్రవాసుల నుంచి అత్యధిక సొమ్ము అందుకుంటున్న దేశంగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది. 2020లో ప్రవాసుల నుంచి 83 బిలియన్ డాలర్లను(రూ.6.11 లక్షల కోట్లు) భారత్ అందుకుంది.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 0.2 శాతం తక్కువే అయినప్పటికీ కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో ఈ స్థాయిలో సొమ్ములు అందడం విశేషం. 2019లో 83.3 బిలియన్ డాలర్లు భారత్​కు వచ్చాయి. అయితే యూఏఈ నుంచి వచ్చే సొమ్ము మాత్రం 2020లో 17శాతం పడిపోయింది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి చెల్లింపులు పెరగడం.. ఈ లోటును భర్తీ చేసినట్లైంది.

రెండో స్థానంలో చైనా

భారత్​ తర్వాత అత్యధికంగా ప్రవాసీల చెల్లింపులు పొందుతున్న దేశంగా చైనా నిలిచింది. 2020లో చైనా 59.5 బిలియన్ డాలర్లను అందుకుంది. అంతకుముందు ఏడాది(68.3 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. పొరుగు దేశం పాకిస్థాన్​ 26 బిలియన్లను అందుకుంది.

భారత్, చైనా తర్వాత ఈ జాబితాలో మెక్సికో(42.8 బిలియన్లు), ఫిలిప్పీన్స్(34.9 బిలియన్లు), ఈజిప్ట్(29.6 బిలియన్లు), ఫ్రాన్స్(24.4 బిలియన్లు), బంగ్లాదేశ్(21 బిలియన్లు) దేశాలు ఉన్నాయి.

కాగా, పాకిస్థాన్​కు విదేశాల నుంచి చెల్లింపులు 17 శాతం మేర పెరిగాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చే సొమ్ము భారీగా పెరిగింది. ఈయూ దేశాలు, యూఏఈ నుంచి వచ్చే నగదు సైతం అధికమైంది.

ఇదీ చదవండి: ఆసియాలో కరోనా వ్యాప్తిపై 'రెడ్‌క్రాస్‌' ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.