ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న సవాళ్ల నేపథ్యంలో భారత్‌ను కీలక భాగస్వామిగా అమెరికా భావిస్తోందని పెంటగాన్ ప్రకటించింది. 'క్వాడ్' కూటమి(భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా బృందం) రక్షణ మంత్రుల సమావేశం గురువారం వర్చువల్‌గా జరగనున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అమెరికా కాలమానం ప్రకారం గురువారం జరగనుంది.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన అమెరికా, కరోనాపై పోరు, వాాతావరణ మార్పులు వంటి అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్తామని తెలిపింది.
''భారత్-అమెరికా ద్వైపాక్షిక అంశాల్లో సైనిక సంబంధాలు అతి ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి. భారత్‌తో సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పూర్తి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పరస్పరం సహాయం చేసుకోవాల్సిన అవసరాన్ని అమెరికా గుర్తించింది.''
-జాన్ కిర్బీ, పెంటగాన్ అధికార ప్రతినిధి
ఇదీ చదవండి: 'భారత్- చైనా ఉద్రిక్తతలను గమనిస్తున్నాం'