ETV Bharat / international

'వివాదాల పరిష్కారానికి కీలక సమయమిది'

భారత్​- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం కీలక దశలో ఉందని అమెరికా మాజీ అధికారి ఒకరు తన నివేదికలో వెల్లడించారు. ఉద్రిక్తతలను తగ్గించి ఒప్పందం వైపు ఇరు దేశాలు అడుగులు వేయాలని సూచించారు. వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత్​- అమెరికా మైత్రి కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Jul 17, 2019, 10:20 AM IST

'21వ శతాబ్దంలో భారత్​- అమెరికా మైత్రి కీలకం'

భారత్​, అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టాలని ట్రంప్​ పరిపాలన విభాగంలోని మాజీ అధికారి ఒకరు తన నివేదికలో వెల్లడించారు. మేధో సంపత్తి హక్కులు, డిజిటల్​ వాణిజ్యం​ వంటి విభాగాల్లో సహాయసహకారాలు అవసరమని నివేదించారు.

దక్షిణ, కేంద్ర ఆసియా వ్యవహారాలకు అమెరికా వాణిజ్య ప్రతినిధిగా సేవలందించిన మాజీ అధికారి మార్క్​ లిన్స్​కాట్​ 'ట్రేడ్​ అట్​ ఏ క్రాస్​రోడ్స్​: ఏ విజన్​ ఫర్​ ద యూఎస్​-ఇండియా ట్రేడ్​ రిలేషన్​షిప్​' పేరిట నివేదిక రూపొందించారు. ఈ నివేదికను అట్లాంటిక్​ కౌన్సిల్​, అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదికలో (​యూఎస్​ఐఎస్​పీఎఫ్​)లో సమర్పించారు.

అమెరికా ప్రతినిధులు భారత్​తో చర్చల అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే ఈ నివేదిక విడుదల చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నివేదికలో భారత్​-అమెరికాల మధ్య సంబంధాలు, ఇటీవలి చర్చలు, స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలికంగా అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.

" ప్రస్తుత ఇరు దేశాల సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించటం అంత సులువు కాదు. ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు బలోపేతం కావాలంటే తక్షణ చర్యలు అవసరం. ఈ అంశంలో రెండు దేశాలు కీలక దశలో ఉన్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలతో ఇరు దేశాలు ప్రతికార చర్యలకు సిద్ధపడుతున్నాయి. జీఎస్పీ హోదా తొలగింపు, ఒకరి వస్తువులపై ఒకరు సుంకాల పెంపు వంటివి ఇందులో భాగమే. అవి కొత్త చిక్కులను సృష్టిస్తున్నాయి. ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు చేపట్టాలి. ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని కలిగించేలా తక్షణ చర్యలు అవసరం. అమెరికా-భారత్​ సంబంధాలు 21వ శతాబ్దంలో చాలా కీలకమైనవి. "

- నివేదిక సారాంశం.

2018లో వస్తువల వాణిజ్యంలో భారత్​కు అమెరికా రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. భారతీయ ఎగుమతి దారులకు అమెరికా అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది.

ఇదీ చూడండి: ఇరాన్​లో అధికార మార్పిడి కోరుకోవట్లేదు : ట్రంప్

New Delhi, Jul 17 (ANI): The proceedings of Parliament continued till midnight on Tuesday. The house sat late to discuss various issues. Pralhad Joshi, Parliamentary Affairs Minister said, "It's being done with the initiation of speaker, government and all MPs. Farmer issues were discussed. For the first time, there has been such productivity and our concern for farmers can be seen through this." Union Agriculture Minister Narendra Singh Tomar said, "MPs participated in discussion in large no. and gave suggestions. It's a matter of happiness that everyone took interest in agriculture and rural issues, till this hour. When all work together, a solution naturally comes out."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.