ETV Bharat / international

కరోనాకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తున్నారిలా... - కరోనా లక్షణాలు

కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్​ ఒక్కటే మార్గమా? అసలు వ్యాక్సిన్​ ఎలా పనిచేస్తుంది? కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్​కు ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్​ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు?

How vaccines work against COVID-19How vaccines work against COVID-19
కరోనాకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తున్నారిలా...
author img

By

Published : Mar 18, 2020, 11:13 AM IST

కరోనాకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తున్నారిలా

కరోనా... ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెను సవాల్. ఆ వైరస్​కు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్​ కనుగొనడమే శాస్త్రవేత్తల లక్ష్యం. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధకులు వేర్వేరు వ్యూహాలు అనుసరిస్తున్నారు. అవేంటో చూద్దాం.

వ్యాక్సిన్ అంటే?

మనం అనారోగ్యానికి గురికాకముందే ప్రమాదకర వైరస్​లను గుర్తించి, వాటిని పారదోలేలా మన శరీరాన్ని సిద్ధం చేస్తాయి వ్యాక్సిన్​లు.

వ్యాక్సిన్​ తయారీ ఎలా?

పాత పద్ధతుల్లో... చనిపోయిన లేదా బలహీనపడిన వైరస్​లను ఉపయోగించి వ్యాక్సిన్లు తయారు చేసేవారు. ఫ్లూ, పొంగు వ్యాక్సిన్లు ఇలా చేసినవే. కానీ వ్యాక్సిన్ల కోసం వైరస్​లను పెంచడం చాలా కష్టం, ప్రమాదకరం.

అందుకే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం సరికొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తున్నారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్​ తయారీలో వైరస్​ ఉపయోగించరు. కాబట్టి వ్యాక్సిన్​ తీసుకున్నవారికి ఎలాంటి ముప్పు ఉండదు.

ఆ ప్రొటీనే కీలకం...

స్పైక్ ప్రొటీన్​లో కరోనా వైరస్​ దాగి ఉంటుంది. ఆ ప్రొటీన్​ నుంచే వైరస్​ బయటకు వచ్చి శరీర కణాలపై దాడి చేస్తుంది. మనిషి రోగ నిరోధక వ్యవస్థ ముందే ఆ ప్రొటీన్​ను గుర్తించి, అడ్డగిస్తే... కరోనా సోకదు.

వైరస్​కు సంబంధించిన జన్యు కోడ్​ను కాపీ చేయడమే వ్యాక్సిన్​ తయారీలో కీలకం. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆర్​ఎన్​ఐ మెసెంజర్, సింథటిక్ డీఎన్​ఏ అనే రెండు పద్ధతులు అనుసరిస్తుంటారు. ఇలా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థలో భాగమవుతుంది. కరోనా వైరస్​ వస్తే పోరాడుతుంది.

వ్యాక్సిన్​ను ఏ పద్ధతిలో అభివృద్ధి చేసినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు 12-18 నెలలు పడుతుంది.

ఇదీ చదవండి: వైరస్సే కదా అని తేలిగ్గా చూస్తే.. అధ్యక్ష ఎన్నికలు ఆపేస్తా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.