ETV Bharat / international

గబ్బిలాల నుంచి 'నిఫా' ఎలా సంక్రమిస్తుందో తెలుసా? - గబ్బిలాల నుంచి నిఫా సంక్రమణ

2018లో కేరళలో నిఫా వైరస్​ విజృంభించి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్​ బారిన పడిన వారిలో దాదాపు 75 శాతం మంది మరణిస్తారు. గబ్బిలాల్లో కనిపించే ఈ వైరస్​.. మానవులకు ఎలా సోకుతుందనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. తాజాగా ఓ అధ్యయనం నిఫా వైరస్​ గబ్బిలాల నుంచి మనుషులకు ఎలా సోకుతుందనేది వెల్లడించింది.

Nipah virus
నిఫా వైరస్​
author img

By

Published : Nov 7, 2020, 7:37 PM IST

వైరస్​ నిఫా.. దాని బారిన పడిన వారిలో 75 శాతం మంది ప్రాణాలను హరించి వేస్తుంది. ఈ వైరస్​ సోకి 2018లో కేరళలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గబ్బిలాల్లో కనిపించే ఈ వైరస్​.. మానవులకు ఎలా సోకుతుందనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. అయితే.. తాజాగా ఓ అధ్యయనం మానవులకు ఎలా సోకుంతుదనే అంశాన్ని వెల్లడించింది.

ఆరేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం.. నిఫా వైరస్​ గబ్బిలాల మధ్య ఏ విధంగా వ్యాప్తి చెందుతుందనే అంశాన్ని వెల్లడించింది. మానవుల్లో ఈ వైరస్​ ఎప్పుడు విజృంభిస్తుందో అంచనా వేసేందుకు ఈ అధ్యయనం సాయపడనుంది.

ఈ పరిశోధన పీఎన్​ఏఎస్​ జర్నల్​లో ప్రచురితమైంది.

" మానవుల్లో వ్యాప్తిని అడ్డుకునేందుకు.. గబ్బిలాలలో ఈ వైరస్​ ఎప్పుడు వ్యాపిస్తుందో తెలుసుకోవాలి. ఈ అధ్యయనం గబ్బిలాలలో నిఫా సంక్రమణ నమూనాల గురించి లోతైన అవగాహనను అందిస్తుంది. కేరళ, బంగ్లాదేశ్​లలో గతంలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. భారతీయ గబ్బిలాలు ఈ నిఫా వైరస్​ను వ్యాప్తి చేస్తాయని తేలింది. ఏడాదిలో ఏ సమయంలోనైనా గబ్బిలాలు, మానవుల మధ్య సంబంధం ఏర్పడిన క్రమంలో వైరస్​ మానవులకు సోకుతుందని సైద్ధాంతికంగా రుజువైంది. పండ్ల చెట్లల్లో పరపరాగ సంపర్కానికి గబ్బిలాలు చాలా ముఖ్యం. కాబట్టి వాటిని వదిలించుకోవటం సరికాదు. వైరస్​ వ్యాప్తి మార్గాలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అవి మన ఆహారం, నీటిని కలుషితం చేయకుండా చూసుకోవాలి."

- జోనాథన్​ ఎప్​స్టీన్​, రచయిత, పరిశోధకుడు.

భారత్​లోని అన్ని ప్రాంతాల్లో గబ్బిలాలు ఉంటాయి. గ్రామాల్లో పెద్ద పెద్ద వృక్షాల్లో వేలాది గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకుంటాయి. అయితే.. వాటి సంఖ్య, అవి ఎంత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయనేది ముఖ్యమని తెలిపారు ఎప్​స్టీన్​. అయితే.. గబ్బిలాలను తరిమికొట్టటం ఈ సమస్యకు పరిష్కారం కాదని హెచ్చరించారు. అలా చేయటం ద్వారా ఇతర ప్రాంతంలోని వాటికి వైరస్​ సోకి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు.

గబ్బిలాల్లో ఈ వైరస్​ విజృంభించినప్పుడు.. వాటి మూత్రం, ఇతర శరీర ద్రవాల్లో వైరస్​ చేరి బయటకు వస్తుందని తెలిపారు ఎప్​స్టీన్. వాటి ద్వారా మానవులకు సోకేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. ప్రధానంగా చాలా సందర్భాల్లో వైరస్​ సోకిన గబ్బిలాలు తాకిన పండ్ల ద్వారానే మానవులకు ఈ వైరస్​ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. గబ్బిలాల పంటి గాట్లు ఉన్న పండ్లను తీసుకోకపోవటం, వాటిని సరఫరా చేయకపోవటంతో చాలా వరకు వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు.

70 శాతం గబ్బిలాల్లో యాంటీబాడీలు..

గబ్బిలాల జాతిలో 60 నుంచి 70 శాతం వరకు నిఫా వైరస్​ యాంటీబాడీలను కలిగి ఉంటాయని తెలిపారు శాస్త్రవేత్తలు. అయితే..అవి కొన్ని రోజుల తర్వాత తగ్గిపోవటం వల్ల వైరస్​ విజృంభిస్తుందని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్​లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గబ్బిలాల్లో ఈ వైరస్​ విజృంభిస్తున్నట్లు పలు పరిశోధనలు వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది.. నిఫా వైరస్​ సంక్రమణ కాలాన్ని అర్థం చేసుకునేందుకు చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మృత్యు వైరస్​ 'నిఫా' మళ్లీ వస్తుందా...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.