కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఉద్దేశించిన ఎన్-95 మాస్కుల ధరలు ఒకింత ఎక్కువగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేసే అవకాశం లేకపోవడం వల్ల నిర్దిష్ట సమయం పాటు వాటిని వాడి, పారేయాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు అమెరికా శాస్ట్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు.
ఈ పద్దతిలో ఎన్-95 మాస్కులను ఏకంగా 25 సార్లు శుభ్రం చేసి, తిరిగివాడొచ్చు. వాటి రక్షణ సామర్థ్యం ఏ మాత్రం తగ్గదు. ఎన్-95 మాస్కులను సాధారణంగా ఆస్పత్రుల్లో ఆరోగ్యపరిరక్షణ సిబ్బంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అనేక దేశాల్లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో వైద్య సిబ్బంది వాటిని తిరిగి వాడటం లేదా తక్కువ రక్షణ సామర్థ్యమున్న ఇతర మాస్కులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బెథ్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు వేపరైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తెరపైకి తెచ్చారు. ఇది సాధారణం క్రిమినాశక రూపాయం. దీని సాయంతో ఎన్-95 మాస్కులను శుద్ధి చేయవచ్చిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విధానంలో పాతికసార్లు శుద్ధి చేసినా మాస్కు, పటిష్ఠత, సమర్థత ఏ మాత్రం తగ్గదేలేదని వెల్లడైంది. దాని సీళ్లు చెక్కుదరలేదని తేలింది.
ఇదీ చదవండి: 83 వారాల తర్వాత స్కూల్స్ రీఓపెన్- నగరమంతా ట్రాఫిక్ జామ్!