ETV Bharat / international

ట్రంప్‌ .. భవిష్యత్‌లోనూ పోటీ చేయకుండా.. - ట్రంప్ పై అభిశంసన తీర్మానం

క్యాపిటల్​ విధ్యంసం తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. అధ్యక్ష పదవికి భవిష్యత్​లోనూ పోటీ చేయకుండా ఉండే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు డెమొక్రాట్లు. అభిశంసన ప్రక్రియ మొదలు పెట్టి బైడెన్​ అధ్యక్షుడయ్యాక అభిశంసన నెగ్గేందుకు చూస్తున్నారు. అధ్యక్ష పదవేకాక మరే పదవిలోకిగానీ ట్రంప్ అడుగుపెట్టకుండా నిషేధం విధించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

House democrats drafts a new article of impeachment against donald trump
ట్రంప్‌ .. భవిష్యత్‌లోనూ పోటీ చేయకుండా తీర్మానం!
author img

By

Published : Jan 10, 2021, 1:45 PM IST

మామూలుగానైతే అమెరికాలో ఇది కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి, నూతన ప్రభుత్వం కొలువుదీరటం గురించి ఆలోచించాల్సిన సమయం. కానీ అమెరికాలోని రాజకీయ, రాజ్యాంగ, న్యాయ కోవిదులంతా పాత అధ్యక్షుడిని శాశ్వతంగా ‘సాగనంపటం’ ఎలా అని ఆలోచిస్తున్నారు. జనవరి 20 వరకూ కూడా ఉంచకుండా ముందస్తుగానే అధ్యక్షుడు ట్రంప్‌ను పదవీచ్యుత్యుణ్ని చేయడానికున్న అవకాశాలతో పాటు... మునుముందు కూడా ట్రంప్‌ గోల లేకుండా చేయడమెలా అని కుస్తీ పడుతున్నారు. ఒకవేళ ఈసారి ముందస్తుగా దించేయలేకపోయినా... మళ్లీ ఎన్నడూ ట్రంప్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఉండేలా చేయాలని (నిబంధనల ప్రకారం ట్రంప్‌ మరోమారు పోటీ చేసే అవకాశం ఉంది. 2024లో పోటీ చేసే ఆలోచన ఉందని కూడా ట్రంప్‌ తెలిపారు.) డెమొక్రాట్లు వ్యూహాలు రచిస్తున్నారు.

> రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈనెల 20 మధ్యాహ్నంతో ట్రంప్‌ పదవీకాలం ముగిసిపోతుంది. అదే రోజు కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ రెండ్రోజుల కిందట వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో జరిగిన అరాచకం నేపథ్యంలో- ట్రంప్‌ను అవమానకరరీతిలో సాగనంపాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. దీంతో ఆయనపై రెండోసారి అభిశంసన తీర్మానం చేసి (2019లో ఓసారి అభిశంసన తీర్మానం పెట్టారు. అది వీగిపోయింది.)గానీ, లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించిగానీ పదవి నుంచి పంపాలనుకుంటున్నారు.

> అభిశంసన చేయాలంటే అందుకు పెద్ద తతంగమే ఉంది. ప్రధానంగా ఇది రెండంచెల పద్ధతి.

> మొదట ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్‌ చేస్తారు. అభిశంసన అనేది క్రిమినల్‌ కేసుతో సమానం. సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్‌కు పంపిస్తారు.

> అక్కడ కూడా దీనిపై వాదోపవాదాలు సాగుతాయి. అభిశంసన మేనేజర్లను నియమించి వాదనలు వింటారు. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు.

> సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.

> ప్రస్తుత సెనేట్‌ లెక్కల ప్రకారం- ఈ తీర్మానం నెగ్గాలంటే 17 మంది రిపబ్లికన్‌ సెనేటర్లు (ట్రంప్‌ పార్టీవాళ్లు) డెమొక్రాట్లకు మద్దతివ్వాల్సి ఉంటుంది. అది కాసింత కష్టసాధ్యమే!

> భవిష్యత్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ట్రంప్‌ను నిషేధించే తీర్మానాన్ని సెనేట్‌ ఆమోదించే అవకాశాలు లేకపోలేదు. ఈ తీర్మానం నెగ్గటానికి సాధారణ మెజార్టీ చాలు.

> ఇది ఒకింత సాధ్యమయ్యేదిగానే కనిపిస్తోంది. డెమొక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్‌లు కూడా ఈ తీర్మానానికి మద్దతివ్వొచ్చు. అందుకు రెండు కారణాలు. ఒకటి- ట్రంప్‌ను అభిశంసించటం కాకుండా భవిష్యత్‌లో పోటీ చేయకుండా నిషేధించటం; రెండోది- ట్రంప్‌పై నిషేధం విధిస్తే తమలో కొంతమందికి వచ్చేసారి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది.

> 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించటం కూడా అంత సులభమేమీ కాదు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, కేబినెట్‌ సభ్యులంతా అధ్యక్షుడి అసమర్థతను తెలుపుతూ సెనేట్‌కు లేఖ రాయాలి. దాన్ని సెనేట్‌ ఆమోదించాలి. ఇదంతా స్వల్పకాలంలో తేలేది కాదు.

> అభిశంసన కూడా అంత త్వరగా తేలేదిలా లేదు. అందుకే మధ్యేమార్గంగా ఇప్పుడు పదవిలోంచి తీసేసేట్లుగా కాకుండా భవిష్యత్‌లో ట్రంప్‌ మళ్లీ పోటీచేయకుండా నిషేధం విధించేలా అభిశంసన తీర్మానం చేయాలనేది ఆలోచన. దీనికి కూడా సమయం పడుతుంది. బహుశా జనవరి 20 దాటుతుంది.

> పదవిలోంచి దిగిపోయిన తర్వాతా అభిశంసన చేయొచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

> ఇందుకు అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు కొంతమంది వాదిస్తున్నారు. అధ్యక్షుడిని కాకున్నా ఉన్నత పదవిలో ఉన్నవారిపై పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన తీర్మానం నడిచిన సందర్భాన్ని వారు చూపిస్తున్నారు.

> 1876లో అప్పటి అధ్యక్షుడు యులిసిస్‌ దగ్గర పనిచేసిన రక్షణ, యుద్ధ వ్యవహారాల కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ కార్యదర్శి రాజీనామా చేశారు. అయినా ఆయనపై అభిశంసన తీర్మానం నడిచింది.

ట్రంప్‌ అభిశంసన విషయంలో డెమొక్రాట్ల పట్టుదల ఎంతమేరకు పనిచేస్తుందో చూడాలి. ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు అభిశంసన ప్రక్రియ మొదలెట్టి... బైడెన్‌ అధ్యక్షుడయ్యాక దాన్ని కొనసాగించొచ్చు. అప్పుడు సెనేట్‌లోనూ డెమొక్రాట్లకు బలం పెరుగుతుంది. కాబట్టి అభిశంసన నెగ్గటానికి అవకాశాలుంటాయి. అలా ట్రంప్‌ను ప్రస్తుతానికి ఏమీ చేయలేకున్నా... భవిష్యత్‌లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా, మరే పదవిలోకిగానీ అడుగుపెట్టకుండా నిషేధం విధించే అవకాశం దొరుకుతుందనేది డెమొక్రాట్ల వ్యూహంగా కనిపిస్తోంది.

152 ఏళ్ల తర్వాత..

అమెరికా ప్రజాస్వామ్య చరిత్రపై ‘తనదైన’ ముద్ర వేసిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోతూపోతూ మరో భిన్నమైన పోకడకు తెరతీసి పోతున్నారు. అదే కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించడం. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి...పాత అధ్యక్షుడు రానంటూ సంప్రదాయాన్ని బహిరంగంగా తోసిపుచ్చటం 152 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుందంటున్నారు చరిత్రకారులు! రాకుండా ఉన్న సంఘటనలున్నాయిగాని... రానని ముందే చెప్పినతీరు మాత్రం చివరిసారిగా 1869లో జరిగిందంటున్నారు. అప్పట్లో యులిసెస్‌ గ్రాంట్‌ ప్రమాణం చేస్తుంటే... అక్కడికి రాకుండా పాత అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ శ్వేతసౌధంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఎవ్వరూ అలా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ‘ఘనత’ ట్రంప్‌కు దక్కబోతోంది. 1801లో జాన్‌ ఆడమ్స్, 1829లో క్విన్సీ ఆడమ్స్‌లు కూడా... కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. ప్రమాణానికి ముందే వారు వాషింగ్టన్‌ను వదిలి వెళ్లిపోయారు. ఈ అన్ని సందర్భాల్లోనూ వారిమధ్య వ్యక్తిగత వైరుధ్యాలు, రాజకీయ అహాలే కారణాలుగా చెబుతారు. 1921లోనూ అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ కొత్త అధ్యక్షుడు హార్డింగ్‌ ప్రమాణానికి రాలేదు. కారణం అనారోగ్యం. అయినా విల్సన్‌- హార్డింగ్‌తో కలసి కారులో క్యాపిటల్‌ భవనానికి వచ్చి వెళ్లారు.

1974లో గెరాల్డ్‌ ఫోర్డ్‌ ప్రమాణం చేస్తుంటే రాజీనామా చేసిన అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ అక్కడ లేరు. తాజాగా ట్రంప్‌ తనదైన శైలిలో ముందే రానని తేల్చిచెప్పేశారు. మరోవైపు బైడెన్‌ కూడా..‘'ట్రంప్‌ రాకున్నా ఫర్వాలేదు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వస్తే చాలు. ఆయన రాకను ఎంతో గౌరవంగా భావిస్తా’' అని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇదీ చదవండి : 'అమెరికా చరిత్రలోనే ట్రంప్​ అసమర్థ అధ్యక్షుడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.