ETV Bharat / international

'వాక్సిన్​ పంపిణీలో ప్రపంచ దేశాలకు మోదీ అనుసరణీయం' - వాక్సిన్​ పంపిణీలో ప్రపంచ దేశాలు మోదీని అనుసరించాలి:ఐరాస

ప్రపంచ దేశాలకు వాక్సిన్​ పంపిణీ చేస్తున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్ అధనోమ్. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ మోదీనే అనుసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'Hope other countries follow your example': WHO chief Ghebreyesus lauds India, PM Modi
వాక్సిన్​ పంపిణీలో ప్రపంచ దేశాలు మోదీని అనుసరించాలి:ఐరాస
author img

By

Published : Feb 26, 2021, 4:15 PM IST

Updated : Feb 26, 2021, 4:40 PM IST

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు పైగా కరోనా టీకాలను పంపిణీ చేస్తూ.. వాక్సిన్​ ఈక్విటీ కార్యక్రమానికి మద్దతునిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ టెడ్రోస్ అధనోమ్ ప్రశంసించారు. ఈ అంశంలో ప్రపంచ దేశాలు మోదీ మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ట్విట్టిర్​ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

పేద దేశాలకు కరోనా టీకా అందించేందుకు ఐరాస ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రపంచ కూటమి 'కొవాక్స్'.. ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా వాక్సిన్​ అందించాలనే ఉద్దేశంతో వాక్సిన్​ ఈక్విటీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కార్యక్రమానికి భారత్​ తనవంతు సహకారాన్ని అందించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఉత్పత్తైన టీకాలను పశ్చిమాఫ్రికా దేశమైన 'ఘనా'కు యూనిసెఫ్​ సహకారంతో ఇటీవల 6లక్షల డోసులను సరఫరా చేసింది.

కరోనా టీకాలను భారత్ తన సహచర దేశాలైన బంగ్లాదేశ్​కు 20లక్షలు, మయన్మార్​కు​ 17 లక్షలు, నేపాల్​కు 10, భూటాన్​కు​ 1.5 లక్షలు, మాల్దీపులకు లక్ష, మారిషస్​కు 1లక్ష, శ్రీలంకకు 5లక్షలు, బహ్రెయిన్​కు​ 1లక్ష, యెమెన్​కు​ 1లక్ష, అఫ్గానిస్థాన్​కు 5లక్షలు, డొమనికాకు70,000 చొప్పున ఉచితంగానే అందించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ చెప్పారు.

బ్రెజిల్​కు 20లక్షలు, మొరాకోకు 60లక్షలు, బంగ్లాదేశ్​కు 50లక్షలు, మయన్మార్​కు 20లక్షలు, ఈజిప్టుకు 50వేలు, దక్షిణాఫ్రికాకు 10లక్షలు, కువైట్​కు 2లక్షలు, యూఏఈకి 2లక్షల చొప్పున వాణిజ్య పరంగా విక్రయించామని అనురాగ్​ శ్రీవాస్తవ వెల్లడించారు.

ఇదీ చదవండి:భారత్​-పాక్​ ప్రకటనపై ఐరాస హర్షం

Last Updated : Feb 26, 2021, 4:40 PM IST

For All Latest Updates

TAGGED:

PM Modi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.