ETV Bharat / international

అమెరికాలో ప్రవాసుల 'సేవా దీపావళి' - న్యూజెర్సీ

అమెరికాలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయులు తమ ఉదారతను చాటుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా సతమతమవుతున్న వారికి 'సేవా దీపావళి' పేరిట చేయూతనందిస్తూ అండగా నిలుస్తున్నారు.

Hindu-American community mobilises efforts to distribute over 2,96,000 pounds of food amid COVID-19
లక్షా యాభైవేల కేజీల ఆహర పదార్థాల పంపిణీ!
author img

By

Published : Dec 31, 2020, 4:33 PM IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ-అమెరికన్లు సహా.. స్థానిక ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు అగ్రరాజ్యంలోని హిందూ-అమెరికన్లు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. సుమారు 26 రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఇతరులకు అండగా నిలుస్తున్నారు.

సేవా దీపావళి..

గత రెండు నెలలుగా అమెరికావ్యాప్తంగా 175కి పైగా సంస్థలు, వ్యక్తులు ఆహార అవసరాలు తీర్చే మహా యజ్ఞంలో తమవంతు సహకారాన్ని అందించారు. 26 రాష్ట్రాల్లోని 210 నగరాల్లోని 199 ప్యాంట్రీలు, ఉచిత ఆహార కిచెన్‌లు, ఆశ్రయాల్లో లక్షా 30వేల కేజీల ఆహారాన్ని సేకరించారు. 'సేవా దీపావళి' చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా న్యూజెర్సీలో రికార్డ్ స్థాయిలో 55000కేజీల ఆహారాన్ని సేకరించామని నిర్వాహకులు తెలిపారు.

'సేవా దీపావళి'... ప్రవాస భారతీయులకు అండగా నిలవాలనే లక్ష్యంతో న్యూజెర్సీలో 2018లో ప్రారంభమైంది.

ఇదీ చదవండి: 'టైర్​ బెడ్స్​'తో వీధి జంతువులకు చలి నుంచి రక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.