న్యూయార్క్ నగరంలోని మ్యాన్‌హాట్టన్‌లో ఓ హెలికాప్టర్ భవనంపై కుప్పకూలింది. నేడు జరిగిన ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. వర్షం వల్ల ఆకాశ మార్గం సరిగా కనపడక అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
హెలికాప్టర్‌ను ఎవరూ కూల్చలేదని, అత్యవసరంగా ఓ భవనంపై దించే ప్రయత్నంలో కుప్పకూలినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని న్యూయార్క్ గవర్నర్ అండ్రూ కుమో ప్రకటించారు. ప్రమాద సమయంలో భవనం స్వల్పంగా కంపించినట్టు కొందరు చెప్పారని తెలిపారు.
ఒక్కసారిగా విమానం కూలడం వల్ల భవనంపై మంటలు చెలరేగగా.. అగ్నిమాపక దళం వెంటనే ఆర్పేసింది.
ప్రమాదం గురించిన వివరాలు తెలుసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.