భూమిపై వాయుకాలుష్య నియంత్రణలో, ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కోవడంలో అమెజాన్ అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఇక్కడ కార్చిచ్చులు పెరిగిపోయాయి. గత వారం రోజుల నుంచి అవి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
తాజాగా బ్రెజిల్ దేశంలోని రాండోనియా రాష్ట్రానికి చెందిన అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు.
జీ-7 స్పందన
ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో అమెజాన్ అడవుల సంరక్షణకై బృందం నుంచి 20 మిలియన్ డాలర్లను ప్రకటించారు. ఇక బ్రిటన్ 12 మిలియన్ డాలర్లు, కెనడా 11 మిలియన్ డాలర్లను ప్రకటించింది.
ఇదీ చూడండి:అమెరికా: భారీ విస్ఫోటనానికి భవనం ఆహుతి