ETV Bharat / international

దశాబ్ద కాలంలో రికార్డుస్థాయిలో ద్వేషపూరిత నేరాలు - ద్వేషపూరిత హత్యలు అమెరికా

అగ్రరాజ్యంలో ద్వేషపూరిత నేరాలకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది ఎఫ్​బీఐ. దేశంలో ద్వేషపూరిత నేరాలు దశాబ్ద కాలంలో అత్యధిక స్థాయికి చేరాయని ఆ నివేదిక పేర్కొంది. హత్యలు కూడా పెరిగాయని వెల్లడించింది.

Hate crimes in US reach highest level in more than a decade
దశాబ్ద కాలంలోనే అత్యధిక స్థాయికి ద్వేషపూరిత నేరాలు
author img

By

Published : Nov 17, 2020, 12:29 PM IST

ఆమెరికాలో ద్వేషపూరిత నేరాలు.. దశాబ్దకాలంలోనే అత్యధిక స్థాయికి చేరినట్టు ఓ ఎఫ్​బీఐ నివేదిక పేర్కొంది. దీనితో పాటు ద్వేషపూరిత హత్యలు కూడా రికార్డు స్థాయిలో నమోదైనట్టు వెల్లడించింది.

గతేడాది మొత్తం మీద 7,314 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. 2018లో ఆ సంఖ్య 7,120. 2019లో 51 హత్యలు వెలుగుచూశాయి. ఈ తరహా డేటాను సేకరించడం మొదలుపెట్టిన నాటి(1990 దశాబ్దం) నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఓ వ్యక్తి జాతి, మతం, లిగంతో పాటు ఇతర అంశాలపై వ్యతిరేకతతో ఈ తరహా నేరాలు జరుగుతున్నట్టు ఎఫ్​బీఐ వార్షిక నివేదిక పేర్కొంది.

మతం ఆధారంగా జరిగిన నేరాల్లో 7శాతం పెరుగుదల నమోదైంది. అయితే 2018(1,943)తో పోల్చితే ఆఫ్రో అమెరికన్లపై నేరాలు.. 2019(1,930)లో కొంతమేర తగ్గాయని ఎఫ్​బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది.

2019లో నేరాల సంఖ్య పెరుగుదలకు.. పోలీసు విభాగం మెరుగైన రిపోర్టింగ్​ను అందించడం కూడా ఓ కారణం. అయితే... దేశంలో ఈ తరహా నేరాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని న్యాయశాఖ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

ద్వేషపూరిత నేరాలకు సంబంధించిన డేటాను సేకరించేందుకు సరైన చర్యలు చేపట్టాలని న్యాయశాఖను అభ్యర్థించాయి పలు న్యాయ బృందాలు.

ఇదీ చూడండి:- ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.