కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన అమెరికా.. తమ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో సగం మంది పెద్దలకు కరోనా వ్యాక్సిన్ అందజేసినట్లు వెల్లడించింది. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న 13 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని తెలిపింది.
ఇది దేశ జనాభాలో 50.4 శాతమని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. వీరిలో 32.5 శాతం మందికి 2 సార్లు టీకాలు వేశామని పేర్కొంది. ఈ వారంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్‌ను తిరిగి వినియోగించే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. అరుదైన రక్తం గడ్డకట్టే సమస్యలు వస్తున్నాయన్న అభియోగాల మధ్య అమెరికా ఈ టీకాను నిలిపేసింది.
ఇదీ చదవండి: భారత్‌తోనే చైనా కట్టడి దిశగా అమెరికా!
ఇదీ చదవండి: 2025 తర్వాత తగ్గనున్న చైనా జనాభా