ETV Bharat / international

నిబంధనల ఉల్లంఘనులపై తూటాల వర్షం- ఒకరు మృతి - ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం

అమెరికా- ఫిలడెల్ఫియాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. కొవిడ్​ మార్గదర్శకాలను విస్మరించి, వారు అనధికారిక సమావేశంలో పాల్గొన్నందుకే కాల్పులు జరిపామని స్థానిక పోలీస్​ కమిషనర్​ తెలిపారు.

Gunfire at an illegal large gathering in Philadelphia
ఫిలడెల్ఫియాలో పోలీసుల కాల్పులు- ఒకరు మృతి
author img

By

Published : Mar 21, 2021, 7:02 AM IST

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

ఇదీ చదవండి: పాకిస్థాన్​లో హిందూ జర్నలిస్టు హత్య

ఏం జరిగిందంటే?

ఉత్తర ఫిలడెల్ఫియాలోని నైస్​టౌన్​ పరిసర ప్రాంతాల్లో శనివారం ఓ అనధికారిక సమావేశం జరిగింది. కొవిడ్​ నిబంధనలను పక్కనపెట్టి.. ఓ అద్దె భవనం వెలుపల, లోపల అనేక మంది గుమిగూడారు. ఇది గమనించిన స్థానిక పెట్రోలింగ్​ అధికారులు.. వారిని చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 29ఏళ్ల వ్యక్తిపై 14సార్లు కాల్పులు జరగ్గా.. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు పురుషులు, ఓ మహిళకు గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి పెద్ద సమావేశాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని అక్కడి పోలీస్​ కమిషనర్​ డేనియల్​ ఔట్లా తెలిపారు. కొవిడ్​ మార్గనిర్దేశాల ప్రకారం.. వీటిని నిరోధించేందుకు గస్తీ మరింత విస్తరిస్తామని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విమానం​ ఎక్కుతూ.. మూడు సార్లు కాలుజారిన బైడెన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.