ETV Bharat / international

195 ఏళ్లు వేచి చూస్తేనే గ్రీన్​కార్డ్ కల సాకారం!

author img

By

Published : Jul 23, 2020, 12:11 PM IST

అగ్రరాజ్యంలో స్థిరనివాసం పొందాలంటే ఓ భారతీయుడు వేచిచూడాల్సిన సమయం 195 సంవత్సరాలు. ఈ విషయం ఏకంగా అమెరికా చట్టసభ్యుడే వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించాలని తోటి సభ్యులను కోరారు.

Green Card waitlist for Indian is more than 195 years: US senator
గ్రీన్​కార్డ్ ఆశ నెరవేరాలంటే 195 సం.లు ఆగాల్సిందే!

అమెరికాలో స్థిరపడాలనుకునే వారి కలలు సాకారం కావాలంటే చాలా కాలం నిరీక్షించే పరిస్థితి నెలకొంది. రోజులు నెలలు కాదు ఏకంగా వందల సంవత్సరాల పాటు ఈ నిరీక్షణ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఓ భారతీయుడికి అమెరికాలో శాశ్వత నివాస హక్కు(గ్రీన్ కార్డ్) పొందడానికి పట్టేకాలం ఎంతో తెలుసా? ఏకంగా 195 సంవత్సరాలు. ఈ విషయాన్ని అమెరికన్ రిపబ్లికన్ సెనెటర్ వెల్లడించడం గమనార్హం.

ఈ సమస్యను పరిష్కరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తోటి సభ్యులను కోరారు రిపబ్లికన్ సెనెటర్ మైక్​ లీ. ప్రస్తుతం ఉన్న గ్రీన్​కార్డ్ విధానం వలసదారుల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం కలిగించడం లేదని మైక్ అభిప్రాయపడ్డారు.

"బ్యాక్​లాగ్​లో ప్రవేశించిన ఒక భారతీయ వ్యక్తి ఈబీ-3 గ్రీన్​కార్డ్ సంపాదించాలనుకుంటే 195 సంవత్సరాలు వేచిచూడాల్సి ఉంటుంది. ఒకవేళ వారి పిల్లలకు ఇదే అనిశ్చితి వాతావరణం కల్పిస్తే అందులో ఒక్కరు కూడా అమెరికా పౌరులుగా మారే అవకాశం లేదు."

-మైక్ లీ, రిపబ్లికన్ సెనెటర్

గ్రీన్​కార్డ్​ బ్యాక్​లాగ్​లో చిక్కుకున్న వలసదారులు, వారి పిల్లలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో సెనెటర్ డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన బిల్లుపై మైక్ ​లీ మాట్లాడారు.

సంరక్షణ కోసం చర్యలు!

వలసదారు హోదా కోల్పోకుండానే వారికి కొన్ని రక్షణలు కల్పించే విధంగా బిల్లులో మార్పులు చేసినట్లు డర్బిన్ పేర్కొన్నారు. గ్రీన్​కార్డ్ బ్యాక్​లాగ్​లో ఉన్న వలసదారులు మరో ఉద్యోగం చూసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు.

ఈ బిల్లు ద్వారా ఫెయిర్​నెస్​ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్​ చట్టానికి మూడు మార్పులు జరగనున్నాయి. బిల్లు ద్వారా బ్యాక్​లాగ్​లో ఉన్న వలసదారులు సత్వరమే గ్రీన్​కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. వలసదారులు తమ ఉద్యోగాన్ని మార్చుకోవచ్చు. అంతేగాక వలసదారు హోదా కోల్పోకుండానే దేశంలో ప్రయాణించవచ్చు. ఈ సవరణ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోవడం వల్ల ముందస్తు దరఖాస్తు చేయలేని వలసదారులకు గ్రీన్​కార్డులు కేటాయిస్తారు.

మరోవైపు... 50 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు లేదా 50 శాతం తాత్కాలిక ఉద్యోగులు ఉన్న సంస్థలు హెచ్​1బీ వీసాల ద్వారా అదనపు ఉద్యోగులను చేర్చుకోకుండా ఈ బిల్లు నిరోధిస్తుంది.

భారతీయులకు గ్రీన్​కార్డులు

2019 ఆర్థిక సంవత్సరంలో 9,008 మంది భారతీయులకు ఈబీ1(కేటగిరీ 1) గ్రీన్​కార్డులు జారీ అయ్యాయి. 2,908 మందికి కేటగిరీ 2(ఈబీ2) గ్రీన్​కార్డులు జారీ కాగా.. 5,083 మందికి కేటగిరీ 3(ఈబీ3) గ్రీన్​కార్డులు మంజూరయ్యాయి.

ఇదీ చదవండి- కరోనా రోగి మృతిపై ఆగ్రహం- అంబులెన్స్​కు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.