ETV Bharat / international

అమెరికా 'జూ'లో గొరిల్లాలకు కరోనా

అమెరికాలోని ఒక జూలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్​ వచ్చింది. అంతరించిపోతున్న ఈ జీవులకు కరోనా సోకడం ప్రపంచంలో తొలిసారిగా భావిస్తున్నారు. జూ భద్రతా సిబ్బంది ద్వారా సోకినట్టు అనుమానిస్తున్నారు.

Gorillas corona positive
'అమెరికా జూలో గొరిల్లాలకు కరోనా'
author img

By

Published : Jan 12, 2021, 7:03 PM IST

ప్రపంచంలోనే తొలిసారిగా గొరిల్లాలకు కరోనా వైరస్​ సోకినట్టు తేలింది. అమెరికాలో శాన్​ డీగో జూలోని గొరిల్లాలు లక్షణాలేవీ లేకుండానే కరోనా బారిన పడ్డాయని అధికారులు తెలిపారు.

ఇదే తొలిసారి..

తొలుత జూ సిబ్బందికి కరోనా పాజిటివ్​ వచ్చిందని.. వారంతా మాస్కులు పెట్టుకున్నప్పటికీ గొరిల్లాలు మహమ్మారి బారిన పడ్డాయని అధికారులు వివరించారు. గతంలో పులులకు కరోనా సోకిన ఘటనలున్నా.. గొరిల్లాలకు సోకడం మాత్రం ఇదే తొలిసారి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న గొరిల్లాలు కరోనా బారిన పడిన నేపథ్యంలో వన్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''కరోనా సోకిన గొరిల్లాలను జాగ్రత్తగా చూసుకుంటున్నాం.. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. దగ్గు, జలుబు వంటి లక్షణాలున్నప్పటికీ.. ప్రస్తుతం వీటి ఆరోగ్యం బాగానే ఉంది. వాటి నివాస ప్రాంతంలోనే ఉంచి వాటికి చికిత్స అందిస్తాం. విటమిన్లు, బలమైన ఆహారం అందిస్తున్నాం.''

-పీటర్సన్, జూ అధికారి.

అంతరించిపోతున్న జాతి..

గొరిల్లాలకు కరోనా నేపథ్యంలో.. ఈ జాతులపై మహమ్మారి ఎలా ప్రభావం చూపుతుందనే సమాచారం తెలుసుకొనేందుకు పరిశోధనలు దోహదం చేస్తాయని పార్క్ అధికారులు తెలిపారు. 'వరల్డ్ వైల్డ్​లైఫ్ ఫండ్'​ ప్రకారం.. గత రెండు దశాబ్దాలలో వీటి సంఖ్య 60శాతానికి పైగా తగ్గింది.

ఇదీ చదవండి: చైనాలో 103 కేసులు- 20 వేల మంది క్వారంటైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.