కరోనా టీకా ఏఏ ప్రదేశాల్లో వేస్తున్నారో గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. వేర్వేరు దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్న తరుణంలో గూగుల్ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తాము ఎన్నుకున్న ప్రదేశంలో ఇచ్చే వ్యాక్సిన్ వివరాలు, ఇతర సమాచారాన్నీ తెలుసుకునే వీలు కల్పించింది. స్థానిక అధికార యంత్రాంగం సాయంతో ఈ డేటాను అప్డేట్ చేస్తామని తెలిపింది గూగుల్.
మరింత సాయం
కొవిడ్-19 సంబంధిత సమాచారాన్ని ఈ ఏడాది మార్చి నుంచే తన వెబ్సైట్ల ద్వారా ప్రత్యేకంగా అందిస్తోంది గూగుల్. యూట్యూబ్లో వీటి వీక్షకుల సంఖ్య 400 బిలియన్లకు చేరింది.
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి 100కిపైగా ప్రభుత్వ సంస్థలకు సుమారు 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది గూగుల్. అదనంగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు 15 మిలియన్ డాలర్ల నిధుల్ని సమకూర్చినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ పిచాయ్ క్షమాపణ