ETV Bharat / international

ట్రంప్​ నిర్ణయంపై గూగుల్​, మైక్రోసాఫ్ట్​ ఫైర్ - donald trump latest news

విదేశీ విద్యార్థులు దేశం నుంచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం విధించిన నూతన ఆంక్షలను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో గూగుల్​, ఫేస్​బుక్​, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు చేరాయి. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు వెళ్లిపోతే అమెరికాకు ఆర్థికంగా నష్టం జరుగుతుందని కోర్టుకు తెలిపాయి. ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన హార్వర్డ్ యూనివర్సిటీ​, మసాచుసెట్స్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీలకు అమెరికాలోని 200కు పైగా విద్యాసంస్థలు మద్దతుగా నిలిచాయి.​

Google, Facebook, Microsoft, other tech companies join lawsuit against new student visa rule
ట్రంప్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గూగుల్​, మైక్రోసాఫ్ట్​
author img

By

Published : Jul 14, 2020, 12:45 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని ఇతర దేశాలకు చెందిన విద్యార్థులంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్​ తీసుకొచ్చిన నూతన నిబంధనను అక్కడి విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ​, మసాచుసెట్స్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్​, ఫేస్​బుక్​, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు చేరాయి.

విదేశీ విద్యార్థులను వెనక్కి పంపితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని గూగుల్, ఫేస్​బుక్​, మైక్రోసాఫ్ట్​ సహా ఇతర ప్రముఖ సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఈ విద్యార్థులంతా అగ్రరాజ్య ఆర్థిక వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నాయి. వారిని వెనక్కి పంపిస్తే తిరిగి అమెరికాకు రారని, ఇతర దేశాలకు వెళ్లి అమెరికాకు పోటీ ఇచ్చే పరిస్థితి వస్తుందని వివరించాయి.

అమెరికాలోని కీలక వ్యాపార, ఐటీ రంగాలు విదేశీ విద్యార్థుల ద్వారా ప్రయోజనం పొందుతున్నాయని ప్రముఖ కంపెనీలు కోర్టుకు చెప్పాయి. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగ నియామకాలు, శిక్షణకు సంబంధించి సంస్థల ప్రణాళికలకు మార్పులు చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాయి.

'2018-19 విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికిపైగా విదేశీయులు అమెరికాలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. అమెరికాకు ఆర్థికంగా 41 బిలియన్​ డాలర్ల మేర ప్రయోజనం చేకూరింది. 458,290 ఉద్యోగాల్లో సహకరించారు.' అని దిగ్గజ ఐటీ సంస్థలు కోర్టుకు వివరించాయి. విదేశీ విద్యార్థులు దేశం వీడాలనే నిబంధనను ఎత్తివేయాలని కోరాయి.

200 విద్యాసంస్థల మద్దతు..

విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీకి అమెరికాలోని 200కుపైగా విద్యాసంస్థలు మద్దతుగా నిలిచాయి. ఈ విధానం విద్యార్థుల భద్రతను దెబ్బతీస్తుందని, విద్యాసంస్థలు నెలల తరబడి రూపొందించిన ప్రణాళికలను పునర్​పరిశీలించాల్సి వస్తుందని తెలిపాయి. పిటిషన్లకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశాయి.

హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలను న్యాయస్థానం మంగళవారం విననుంది. ఒక వేళ నూతన విధానాన్ని కోర్టు రద్దు చేయకపోతే విద్యార్థులకు పూర్తిగా ఆన్​లైన్​లో బోధనకు సంబంధించిన ఏర్పాట్లపై అమెరికాలోని విద్యాసంస్థలు ఇమిగ్రేషన్​ అండ్​ ​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​(ఐసీఈ) కు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.

కరోనా వైరస్​ తీవ్రమవుతున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలకు మార్పులు చేసింది ట్రంప్ ప్రభుత్వం. దీని ప్రకారం ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యే విద్యార్థులంతా దేశాన్ని వీడిపోవాలి. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లు సహా అమెరికాలోని విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇవీ చూడండి: ట్రంప్​ 'వీసా దెబ్బ'తో దిక్కుతోచని స్థితిలో మనోళ్లు!

అమెరికాలో విదేశీ విద్యార్థుల పాట్లు- హార్వర్డ్ న్యాయ పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.