ETV Bharat / international

ఆ యాప్​తో ఎఫ్​బీఐ వల- నేరసామ్రాజ్యం గుట్టు రట్టు

అంతర్జాతీయంగా నేర సామ్రాజ్యం ఏటికేడు విస్తరిస్తోంది. నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. దేశవిదేశాల్లో ఉన్న నేరస్థులు సమన్వయంతో పనిచేస్తూ.. కోట్లు కొల్లగొడుతున్నారు. మరి వారిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ నిఘా సంస్థలు పనిచేస్తే? నేరస్థులను మభ్యపెట్టి.. వారినుంచే సమాచారాన్ని కొల్లగొడితే..?

author img

By

Published : Jun 8, 2021, 6:08 PM IST

fbi encrypted app, అమెరికా స్టింగ్​ ఆపరేషన్
స్టింగ్ ఆపరేషన్- నేరసామ్రాజ్య గుట్టు రట్టు!

ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్... 16 దేశాల పోలీసుల కలయిక. 32 టన్నుల మాదక ద్రవ్యాలు, రూ.వెయ్యి కోట్లకు పైగా నగదును పట్టించిన మాధ్యమం.. 800 మంది నేరస్థులపై ఉక్కుపాదం మోపేందుకు ఉపయోగించిన వేదిక. అంతర్జాతీయ స్థాయిలో వివిద దేశాలన్నీ కలిసి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ ఫలితమే ఇదంతా.

అమెరికాకు చెందిన ప్రముఖ దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చేపట్టిన కార్యక్రమమే 'ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్​'. నేరస్థుల నుంచే సమాచారాన్ని సేకరించి.. వారి గుట్టును రట్టు చేసి ఈ ఆపరేషన్​ను విజయవంతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భారీ నేరాలను గుర్తించేందుకు దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఓ పటిష్ఠ భద్రతా ఫీచర్లు ఉన్న ఓ యాప్​ను ఉపయోగించారు. నేరస్థులకు దీన్ని ఎరగా వేశారు.

fbi encrypted app, అమెరికా స్టింగ్​ ఆపరేషన్
సీజ్ చేసిన నగదు

వాటి కోసం అన్వేషణ

నేరస్థులు సాధారణంగా అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న ఫోన్లను ఉపయోగిస్తారు. వారు చేసుకునే మెసేజ్​లు ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడతారు. నేర సామ్రాజ్యంలో సుపరిచితమైన కమ్యూనికేషన్ ప్లాట్​ఫాంలు రెండు ఉన్నాయి. అవి.. ఎన్​క్రో చాట్, స్కై ఈసీసీ. అయితే ఈ వేదికలపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో డ్రగ్ మాఫియా, అండర్​వరల్డ్ గ్యాంగ్​లు అధిక భద్రత కలిగిన ఫోన్లు, ప్లాట్​ఫాంల అన్వేషణలో పడ్డారు.

భారీగా పట్టుబడిన కరెన్సీ

"ఎన్​క్రిప్టెడ్ ప్లాట్​ఫాంలు లేకపోవడం వల్ల నేరస్థులకు శూన్యత ఏర్పడింది. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు మాకు అవకాశం లభించింది. ఓ నిర్దిష్టమైన సాధనాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా.. సమాచారాన్ని సేకరించే ప్రక్రియను రూపొందించాలని అనుకున్నాం. మేం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి.. నేరాలను అరికట్టాం. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకున్నాం. ఆయుధాలను సీజ్ చేశాం. వందల సంఖ్యలో నేరాలను నిలువరించేందుకు ఇది ఉపయోగపడింది."

-కాల్విన్ షివర్స్, ఎఫ్​బీఐ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్

భద్రతా ఫీచర్లు ఉన్న యాప్ అన్వేషణలో ఉన్న నేరస్థులకు పోలీసులే తెరవెనక నుంచి పరిష్కారం చూపించారు. 'అనోమ్' అనే యాప్​ను ఫోన్లలో ఇన్​స్టాల్ చేసి.. నేరస్థులకు చేరేలా ప్రణాళికలు వేశారు. ఇది అత్యంత పటిష్ఠమైన ఉన్న ప్లాట్​ఫాం అని నేరస్థులు విశ్వసించారు. మాఫియాలో దీని వినియోగం బాగా పెరిగింది.

100 దేశాలకు

గత 18 నెలల కాలంలో 300కు పైగా క్రిమినల్ గ్యాంగ్​లకు ఇలాంటి ఫోన్లు చేరాయి. వీరంతా 100 దేశాల్లో పనిచేస్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరా నుంచి తీవ్రమైన నేరాల వరకు.. వారు వేసుకునే ప్రణాళికలన్నింటినీ ఈ యాప్​ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​కు చెందిన అధికారులు ఈ యాప్​ ద్వారా లభించిన సమాచారాన్ని ఉపయోగించి అనేక నేరాలను అడ్డుకున్నారు.

224 మందిని అదుపులోకి తీసుకొని, 4 టన్నుల డ్రగ్స్​ను సీజ్ చేసినట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. 34 మిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. న్యూజిలాండ్​లో 35 మంది అరెస్టు కాగా.. పది లక్షల డాలర్ల విలువైన నగదు, మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు.

"గ్లోబల్ ఆపరేషన్​లో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామి అయింది. వ్యవస్థీకృత నేరాలపై ఇది కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్త నేరసామ్రాజ్యంలో ఈ ఆపరేషన్ ప్రతిధ్వనిస్తోంది."

-స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని

16 దేశాలకు చెందిన పోలీసులు, నిఘా సంస్థలు ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్​లో భాగంగా.. కొకైన్, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలను పెద్ద ఎత్తున పట్టుకున్నారు. 250కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 25 లగ్జరీ కార్లు, 148 మిలియన్ డాలర్ల(రూ. వెయ్యి కోట్లకు పైగా) విలువైన నగదు, క్రిప్టో కరెన్సీలను సీజ్ చేశారు.

గంజాయి

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ లా ఎన్ఫోర్స్​మెంట్ సంస్థలు కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో చెప్పేందుకు ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ ప్రత్యక్ష ఉదాహరణ. బహుళజాతి నేర సంస్థలు వివిధ దేశాల మధ్య జరిపే లావాదేవీలను గుర్తించి, అడ్డగించడానికి ఉత్తమ సాధనాలు అభివృద్ధి చేయడం అత్యవసరం."

గతంలోనూ ఇలాంటి ఆపరేషన్లు జరిగాయి. యూరోపియన్ పోలీసులు గతేడాది ఎన్​క్రోచాట్ నెట్​వర్క్​ను ఛేదించి నేరస్థుల సమాచారాన్ని సేకరించారు. అనేక మందిని అరెస్టు చేశారు.

మార్చిలో బెల్జియం పోలీసులు స్కై ఈసీసీ నెట్​వర్క్​ను ఛేదించారు. నేరస్థుల సమాచారాన్ని పసిగట్టి... 17 టన్నుల కొకైన్​ను సీజ్ చేశారు. అనేక మందిని అరెస్టు చేశారు.

అయితే, ప్రస్తుత ఆపరేషన్ మాత్రం మరింత విస్తృత స్థాయిలో జరిగింది. ఆవిష్కరణలు, అంకితభావం, అపూర్వమైన అంతర్జాతీయ సహకారం వల్ల ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ ఇంతటి విజయం సాధించిందని షివర్స్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు అసమానమైనవని అన్నారు.

ఇదీ చదవండి: Wuhan Lab: అమెరికాకు ఏడాది క్రితమే తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.