ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గటం లేదు. రోజు రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు ఏకంగా 2.85 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2.80 కోట్లు దాటింది.9.07 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది.
మొత్తం కేసులు : 28,019,823
మరణాలు: 907,926
కోలుకున్నవారు: 20,095,952
యాక్టివ్ కేసులు: 7,015,945
- అమెరికాలో వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులుగా 40 వేల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మరో 35 వేల మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 65 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 1.95 లక్షలకు చేరింది.
- మెక్సికోలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 70 వేలకు చేరువైంది. బుధవారం 611 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 6.5 లక్షలకు చేరువైంది.
- బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. బుధవారం మరో 35, 816 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 41.97 లక్షలు దాటింది.
ఏ దేశాల్లో కొవిడ్ ప్రతాపం ఎలా ఉందంటే..
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 6,549,475 | 195,239 |
బ్రెజిల్ | 4,199,332 | 128,653 |
రష్యా | 1,041,007 | 18,135 |
పెరు | 702,776 | 30,236 |
కొలంబియా | 686,856 | 22,053 |
మెక్సికో | 647,507 | 69,095 |
దక్షిణాఫ్రికా | 642,431 | 15,168 |