ETV Bharat / international

Gita Gopinath Imf: ఐఎమ్​ఎఫ్​లో గీతా గోపీనాథ్​కు సరికొత్త బాధ్యతలు

Gita Gopinath Imf: ఐఎమ్​ఎఫ్​లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు గీతా గోపీనాథ్​. ప్రస్తుతం ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్న ఆమెకు.. డిప్యూటీ మేనేజింగ్​ డైరక్టర్​గా పదోన్నతి లభించింది.

Gita Gopinath Imf
ఐఎమ్​ఎఫ్​లో గీతా గోపీనాథ్​కు సరికొత్త బాధ్యతలు
author img

By

Published : Dec 3, 2021, 10:30 AM IST

Updated : Dec 4, 2021, 7:43 AM IST

gita gopinath imf chief economist: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్​ఎఫ్​) ముఖ్య ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్​ గీతా గోపీనాథ్​కు పదోన్నతి లభించింది. ఐఎమ్​ఎఫ్​ మొదటి డిప్యూటీ మేనేజింగ్​ డైరక్టర్​గా(ఎఫ్​డీఎమ్​డీ) ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఐఎమ్​ఎఫ్​లో మొత్తం మీద నలుగురు డిప్యూటీ మేనేజింగ్​ డైరక్టర్​లు ఉంటారు. జెఫ్రె ఓకమోటో.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఐఎమ్​ఎఫ్​ నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో గీతా గోపీనాథ్​ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. మూడేళ్ల పాటు ముఖ్య అర్థికవేత్తగా విధులు నిర్వహించిన గీతా గోపీనాథ్​.. బాధ్యతలు వదిలేసి గతంలో పని చేసిన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి.

ఈ అవకాశం తనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు గీతా గోపీనాథ్​. సహచరులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎఫ్​డీఎమ్​డీగా గీత బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమెపై ఐఎమ్​ఎఫ్​ చీఫ్​ క్రిస్టిలినా జార్జివా ప్రశంల వర్షం కురిపించారు. ఐఎమ్​ఎఫ్​లోనే కొనసాగాలని గీత తీసుకున్న నిర్ణయం సంతోషకరమన్నారు. ఇప్పటివరకు అద్భుతంగా సేవలందించారని కొనియాడారు. కొత్త బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు గీతా గోపీనాథ్​ చేసిన కృషి ప్రశంసనీయమైనది తెలిపారు.

గీతా గోపీనాథ్‌ గురించి ఆసక్తికర విషయాలు..

  • 1971లో కోల్‌కతాలో జన్మించారు. మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.
  • దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో బి.ఎ పూర్తి చేశారు. 1992లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనామిక్స్‌ అభ్యసించారు.
  • వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎం.ఎ ఎకనామిక్స్‌లో చదివే అవకాశం రావడంతో తన ఐఏఎస్‌ ప్రణాళికలను పక్కన పెట్టేశారు. అనంతరం ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు.
  • అక్కడి నుంచి 2010లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఉండగానే 2018లో ఐఎంఎఫ్‌లో పనిచేసే అవకాశం తలుపు తట్టింది.
  • గీతా గోపీనాథ్‌కు ఫ్యాషన్‌ రంగంలోనూ అనుభవం ఉంది. దిల్లీ వర్సిటీలో ఆమె తన భర్త ఇక్భాల్‌ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం వీరికి 18 ఏళ్ల రాహిల్‌ అనే అబ్బాయి ఉన్నాడు.

ఇదీ చూడండి:- 'కరోనాపై పోరులో భారత్ పాత్ర భేష్​'

Last Updated : Dec 4, 2021, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.