ETV Bharat / international

జార్జియా రీకౌంటింగ్​లో బైడెన్​ ఘనవిజయం - US president elections

జార్జియాలో చేపట్టిన ఆడిట్​లో డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై 12,284 ఓట్ల మెజారిటీ సాధించారు.

Georgia official: Vote audit over; Biden still leads Trump
జార్జియా రీకౌంటింగ్​లో బైడెన్​ ఘనవిజయం
author img

By

Published : Nov 20, 2020, 9:23 AM IST

Updated : Nov 20, 2020, 10:24 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన జార్జియాలో చేపట్టిన ఆడిట్​ (చేతితో ఓట్ల లెక్కింపు)లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ ఘన విజయం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై 12,284 ఓట్ల మెజారిటీ సాధించారు. రీకౌంటింగ్​కు ముందు 14,000 ఓట్లు మోజారిటీ ఉండగా.. ప్రస్తుతం మెజారిటీ స్వల్పంగా తగ్గింది.

1992 తర్వాత జార్జియాలో డెమొక్రట్ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. రిపబ్లిక్​ పార్టీకి పట్టున్న ఈ రాష్ట్రంలో బైడెన్​ విజయం సాధించడం గమనార్హం.

'జార్జియాలో మొట్టమొదటిసారి రాష్ట్రవ్యాప్తంగా సురక్షితమైన కాగితపు బ్యాలెట్ ఓటింగ్ విధానం ద్వారా కచ్చితంగా లెక్కించి, ఫలితాలను నివేదించాం' అని ఓ అధికారి అన్నారు.

రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆడిట్​ అవసరమైన 5 మిలియన్ల ఓట్లను చేతితో లెక్కించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది ఎన్నికలపై అనుమానాలు, రీకౌంటింగ్​పై అధికారిక అభ్యర్థనతో మాత్రం కాదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: భూటాన్​ భూభాగంలో చైనా హల్​చల్​

Last Updated : Nov 20, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.