నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు గురై ఏడాది కావస్తున్న నేపథ్యంలో అమెరికాలోని మినియాపొలిస్‌లో అతని కుటుంబసభ్యులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కాల్పుల్లో తమ వాళ్లను పోగొట్టుకున్న ఇతర నల్లజాతీయులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంగళవారం నాటికి ఫ్లాయిడ్ మృతిచెంది ఏడాది కానుంది. ఈ నేపథ్యంలో జార్జి ఫ్లాయిడ్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున అతని కుటుంబసభ్యులు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నా సోదరుడిని మరువద్దు..
తన సోదరుడిని మరువద్దని ప్రజలకు పిలుపునిచ్చారు జార్జి సోదరుడు టెర్రెన్స్ ఫ్లాయిడ్. 'నా సోదరుడిని గుర్తుంచుకోవడం ద్వారా జాత్యహంకార బాధితులు అందరినీ మీరు గుర్తుంచుకున్నట్లే' అని టెర్రెన్స్ అన్నారు.
గతేడాది పోలీసు అధికారి డెరిక్ చౌవిన్.. జార్జిఫ్లాయిడ్ మెడపై మోకాలు మోపి కర్కశంగా హింసించి అతని మరణానికి కారణమయ్యాడు.
ఇదీ చదవండి : క్యాపిటల్ భవనం వీడనున్న నేషనల్ గార్డ్స్!