ETV Bharat / international

ఎన్నికల్లో ఇవే ట్రంప్ కొంప ముంచాయా? - ఎన్నికల్లో ట్రంప్ ఓటమి కారణాలు

ట్రంప్ జాతీయత పనిచేయలేదు. 'అమెరికా ఫస్ట్' నినాదం ఓట్లు రాబట్టలేదు. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' మంత్రం ఈసారి పనిచేయలేదు. చైనాపై దూకుడు కలిసిరాలేదు. మొత్తంగా తెంపరి ట్రంప్ చతికిలపడ్డారు. సుందర శ్వేతసౌధానికి దూరమయ్యారు. మరి ఆయన ఓటమికి కారణాలు చూస్తే.. కర్ణుని చావుకు ఉన్నట్లు సవాలక్ష కనిపిస్తాయి.

reasons for trump defeat
ఎన్నికల్లో ఇవే ట్రంప్ కొంప ముంచాయా?
author img

By

Published : Nov 7, 2020, 11:38 PM IST

నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నా.. అనూహ్యమేమీ జరగలేదు. హోరాహోరీ పోరు జరిగినా.. సంచలనం నమోదు కాలేదు. ముందు నుంచీ అనుకుంటున్నదే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఆవిష్కృతమైంది. కాస్త ఆలస్యంగా అంతే!

రాజకీయ పండితులు, వార్తా సంస్థలు, మేధో వర్గాలు ఊహించినట్లే డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా గెలుపొందారు. అయితే ఆయన గెలిచారనే కంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారనడం కొంతవరకు సమంజసంగా ఉంటుంది. గట్టి పట్టున్న ప్రాంతాలు, రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ ట్రంప్ ఓడిపోయారు. మరి ఇంతలా పోరు ఏకపక్షం కావడానికి, ట్రంప్​ భారీ ఓటమి మూటగట్టుకోవడానికి కారణమేంటి? ప్రస్తుత అధ్యక్షుడు ఈసారి తప్పక పరాజయం చవిచూస్తారని విశ్లేషకులంతా ముందు నుంచీ బల్లగుద్ది చెప్పడానికి సాక్ష్యం ఏంటి? తరచి చూస్తే ఈ ప్రశ్నలకు అనేక సమాధానాలు లభిస్తాయి.

వర్ణ వివక్ష

జాతి వివక్షే ట్రంప్​ ఓటమికి ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యంలో ఈ సామాజిక రుగ్మత ఇప్పట్లో పుట్టింది కాదు. దురదృష్టవశాత్తు అమెరికా చరిత్ర మొత్తం జాతి విద్వేషంతో మమేకమై ఉంది. అయితే.. నివురుగప్పిన నిప్పులా సాగే ఈ ఉన్మాదవైఖరి ట్రంప్ హయాంలో ఆకాశానికి చేరింది. వర్ణ వివక్ష కాలనాగు పడగవిప్పింది. నల్లజాతీయులపై నేరాలకు ఉసిగొల్పింది.

జార్జ్ ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడు పోలీసు కిరాతకానికి బలైపోవడంపై నిరసనాగ్రహాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అల్లర్లకు, పోలీసు దమననీతికి దారితీశాయి. శాంతియుత నిరసనలతో పాటు, హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి. కొందరు లూటీలకు పాల్పడ్డారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు అందరికీ విస్మయం కలిగించింది. లూటీలు జరిగితే కాల్పులు జరపాల్సి వస్తుందని ఆయన చేసిన ట్వీట్​పై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సైన్యాన్ని దించుతానని చెప్పడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫ్లాయిడ్‌ మృతిపట్ల పైకి ట్రంప్‌ విచారం వ్యక్తం చేస్తున్నా ఆయన ట్వీట్లు, చేతలు శ్వేతజాతీయులకు వత్తాసు పలికేలా ఉన్నాయంటూ ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతీయలకు తనలా ఏ అధ్యక్షుడు మెరుగైన పాలన అందించలేదని గొప్పలు చెప్పుకున్నా... ఆఫ్రో అమెరికన్లపై దాడుల పరంపరతో ఆయనపై విశ్వాసం సన్నగిల్లింది.

కరోనా నియంత్రణ

రెండు లక్షలకు పైగా మరణాలు, కోటికి దగ్గరవుతున్న కేసులు... క్లుప్తంగా అమెరికాలో కరోనా విలయానికి ఈ సంఖ్యలు నిదర్శనం. రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలన్న ట్రంప్ అందమైన కలల్ని ఈ మహమ్మారే కల్లలు చేసింది. అయితే అమెరికాలో కరోనా విలయంలో ట్రంప్ నిర్లక్ష్య వైఖరే ప్రధాన వాటా. ఆయన నిర్లక్ష్యం వల్లే ఎక్కడా లేనన్ని కేసులు మరణాలకు అమెరికా కేంద్ర బిందువుగా మారిందనే ఆరోపణలు మేధోవర్గాలు, శాస్త్రవేత్తల నుంచి వెల్లువెత్తాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచీ చైనాపై నోరుపారేసుకుంటూ వచ్చారే కానీ, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎన్ని కేసులు వచ్చినా దేశంలో ఆంక్షలు విధించేది లేదని తెగేసి చెప్పారు. కనీసం ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పలేదు. ప్రజలందరూ మాస్కు ధరించాలని అన్ని దేశాల అధినేతలు నెత్తినోర్లు మొత్తుకుంటుంటే.. ట్రంప్ మాత్రం ప్రజలకు చెప్పడం అటుంచితే.. తాను మాస్కు ధరించేందుకే ససేమిరా అన్నారు. ఈ విషయంలో ఆయన చూపించిన మొండి వైఖరి ఎవరికీ తెలియంది కాదు.

ఫలితం... దేశంలో వైరస్ పరిస్థితి మరింత తీవ్రమైంది. ఎన్నికలకు ముందు ట్రంప్​లానే కరోనా కూడా మొండిగా ప్రబలింది. దీంతో లెక్కలన్నీ మారిపోయాయి. కరోనా నియంత్రణలో విఫలమయ్యారని డెమొక్రాటిక్ పార్టీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శల వర్షం కురిసింది. మరోవైపు ఆయన ఆర్భాటంగా నిర్వహించిన సమావేశాలన్నీ కొవిడ్ స్ప్రెడర్​లుగా మారాయి. ఇవన్నీ ఆయనకు ప్రతికూలంగా మారాయి. చివరకు తనకూ కొవిడ్ సోకింది. అయినా ఇది ట్రంప్​కు కలిసిరాలేదు. కొంతవరకు సానుభూతి దక్కినా.. అవి ఓట్ల రూపంలో తన తలుపుతట్టలేకపోయాయి. చివరకు బైడెన్​ మద్దతు మరింత పెరిగింది. ట్రంప్ పతనానికి కారణమైంది.

ఆర్థిక వ్యవస్థ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ట్రంప్ హయాంలో ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోయింది. కానీ కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమైంది. కొనుగోళ్లు క్షీణించాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. దేశ జీడీపీ 2020 రెండో త్రైమాసికంలో 31.4 శాతం పతనమైంది. ఇది అక్కడి ప్రజలపై ఎనలేని ప్రభావం చూపించింది. అయితే తర్వాత త్రైమాసికంలో 33.1 శాతం వృద్ధి సాధించినప్పటికీ.. చిన్న పరిశ్రమలు, సంక్షోభంలో చిక్కుకున్న శ్రామిక కుటుంబాలను బయటకు తీసుకురాలేకపోయింది.

నిరుద్యోగం

కరోనా సమయంలో అమెరికాలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. 2020 ఏప్రిల్​లో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి ఎగబాకింది. 1948 సంవత్సరం తర్వాత నిరుద్యోగం ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ఇది ఆ దేశ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకానొక సమయంలో 33 లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థమవుతోంది. కరోనాకు ముందు నిరుద్యోగిత రేటు కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ.. వైరస్ వ్యాప్తి తర్వాత మహమ్మారి చూపిన ప్రభావం ట్రంప్ పదవికి ఎసరుపెట్టింది.

ఆరోగ్య భద్రత

కరోనా నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ అనేది ఈ ఎన్నికల్లో కీలకంగా నిలిచింది. ఈ అంశంలో ట్రంప్‌ పనితీరు పేలవంగా ఉందని నిపుణులు చెప్పే మాట. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒబామా తెచ్చిన 'అఫర్డ్‌బుల్‌ కేర్‌ యాక్ట్‌' (ఒబామా కేర్‌) రద్దు అంశం ట్రంప్​కు శరాఘాతమైంది. అప్పటికే కరోనాతో కుదేలైన దిగువ, మధ్య తరగతి ప్రజల మనలులో దీనిపై ఆందోళనలు తలెత్తాయి.

మరోవైపు ఈ పథకాన్ని బలోపేతం చేస్తానని బైడెన్‌ హామీ ఇవ్వడం... పనిచేసే వయసులో ఉన్న అందరికీ దీన్ని వర్తింపజేస్తామని చెప్పడం వల్ల ప్రజలు ఆయనవైపే ఆకర్షితులయ్యారు.

విదేశాంగ విధానం

'అమెరికా ఫస్ట్‌' అనే విధానంపైనే ట్రంప్‌ మొదటి హయాం నడిచింది. అమెరికాకు ప్రాధాన్యమిస్తూ... ప్రపంచంలో పెద్దన్న పాత్ర నుంచి క్రమంగా వైదొలగుతున్న భావన కల్పించారు. ముఖ్యంగా ప్రచ్ఛన్నయుద్ధకాలం నుంచీ సాగుతున్న నాటో మైత్రికి గండి కొట్టారు. కీలకమైన పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. చైనాతోనూ ఘర్షణ వైఖరి అవలంబించారు. ఇటీవలికాలంలో ఏ అధ్యక్షుడూ చేయనంతగా చైనాను తీవ్రంగా ప్రతిఘటించారు. వాణిజ్య యుద్ధానికి దిగారు. కొవిడ్‌ విషయంలోనైతే చైనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనాను చైనా వైరస్‌గా అభివర్ణించారు. వీటిపై అమెరికన్లలో మిశ్రమ స్పందన లభించిందంటారు.

ఉక్రెయిన్ విషయంలో.. ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపణలు వచ్చాయి. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ గతంలో ఉక్రెయిన్‌లోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో బైడెన్, హంటర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా విచారణ చేపట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడి చేశారని ఆరోపణలు వచ్చాయి. బైడెన్‌పై విచారణ చేపడితే ఉక్రెయిన్‌కు నిలిపేసిన సైనికపరమైన సాయాన్ని విడుదల చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్‌ అన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై డెమొక్రాట్ల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఈ క్రమంలోనే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... రిపబ్లికన్ల మద్దతుతో ట్రంప్ ఆ గండం నుంచి గట్టెక్కారు. ఈ ఆరోపణలు మాత్రం ఆయన కొంపముంచినట్లే కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.