అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) ఉన్న నలుగురు వ్యోమగాములు తిరిగి భూమికి (Astronauts returning from Space) చేరుకున్నారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్‌లో బయల్దేరిన వీరు.. ఫ్లోరిడా తీరంలో సముద్రంలో విజయవంతంగా దిగారు. వెంటనే రికవరీ బోట్లు ఆ ప్రాంతానికి చేరుకొని.. వ్యోమగాములను బయటకు తీశాయి.
-
Smiles, thumbs up, and peace signs. The @SpaceX Crew-2 astronauts are happy to be home after six months in space. pic.twitter.com/W9ziABkq0k
— NASA (@NASA) November 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Smiles, thumbs up, and peace signs. The @SpaceX Crew-2 astronauts are happy to be home after six months in space. pic.twitter.com/W9ziABkq0k
— NASA (@NASA) November 9, 2021Smiles, thumbs up, and peace signs. The @SpaceX Crew-2 astronauts are happy to be home after six months in space. pic.twitter.com/W9ziABkq0k
— NASA (@NASA) November 9, 2021
అమెరికా వ్యోమగాములు షేన్ కింబ్రో, మేఘన్ మెకార్థర్, జపాన్‌కు చెందిన అకిహిడో హొషిదే, ఫ్రాన్స్‌కు చెందిన థామస్ పెస్క్వెట్.. తిరిగి భూమికి (Astronauts return to Earth 2021) వచ్చారు. 200 రోజుల పాటు వీరంతా అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేశారు. ఎనిమిది గంటల్లోనే వీరి ప్రయాణం (Astronauts returning from Space) పూర్తి కావడం విశేషం.
టాయిలెట్ పనిచేయని (Space toilet problem) స్పేస్ క్యాప్సూల్‌లో వ్యోమగాములు ప్రయాణించారు. ఎనిమిది గంటల ప్రయాణంలో వీరికి టాయిలెట్ ఉపయోగించే అవకాశం లేదు. ప్రతిఒక్కరూ డైపర్లనే వినియోగించారు.
ఇదీ చదవండి: వ్యోమగాములకు టాయిలెట్లు బంద్... డైపర్లే దిక్కు!
ఐఎస్ఎస్కు మరో నలుగురు
మరోవైపు, స్పేస్ స్టేషన్‌కు మరికొందరు వ్యోమగాములను నాసా పంపనుంది. నలుగురు తిరిగివస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో నలుగురిని (Spacex launch Astronauts) పరిశోధనల నిమిత్తం అక్కడికి పంపిస్తోంది. అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు తిరిగి రావడానికి ముందే వీరు అక్కడికి చేరుకోవాల్సింది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడం, ఓ వ్యోమగామి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఈ ప్రయాణాన్ని నాసా వాయిదా వేసింది. ప్రస్తుతం స్పేస్‌స్టేషన్‌లో ఇద్దరు రష్యన్లు, ఓ అమెరికా వ్యోమగామి ఉన్నారు.
ఇదీ చదవండి: స్పేస్‌వాక్‌తో చైనా మహిళా వ్యోమగామి అరుదైన ఘనత