ETV Bharat / international

పోలీసు కర్కశం- నల్లజాతీయుడిని మోకాలుతో తొక్కిపట్టి.. - ఫోర్జరీ కేసు

మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసుల అమానుష తీరు కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ వ్యక్తి మెడపై పోలీసు ఒకరు మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు.

black man
పోలీసు కర్కశం
author img

By

Published : May 28, 2020, 6:24 AM IST

"దయచేసి నా గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు" అని విలవిలలాడిపోతూ, అతను వెలిబుచ్చిన ఆవేదన ఆ పోలీసు అధికారి ముందు అరణ్య రోదన అయింది. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి ఈ దుర్మార్గం చోటుచేసుకుంది.

అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్‌ ఫ్లాయిడ్‌ (46) అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ కనిపించాడు. కారు నుంచి వెలుపలికి రావాల్సిందిగా ఆదేశించారు. బయటకు రాగానే జార్జ్‌ను నేలపైకి పడగొట్టారు. సంకెళ్లు వేశారు. ఈ క్రమంలో జార్జ్‌ మెడపై పోలీసు అధికారి ఒకరు మోకాలు బలంగా ఆనించాడు.

ప్రాణాలు పోతున్నా కనికరించలేదు..

"అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు" అని పక్కనే ఉన్న ఓ వ్యక్తి గట్టిగా అరిచినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు. ఆ తర్వాత జార్జ్‌లో క్రమక్రమంగా చలనం ఆగిపోయింది. అయినప్పటికీ పోలీసు అధికారిలో ఏమాత్రం కనికరం కనిపించలేదు. వైద్య సంరక్షణ సిబ్బంది స్ట్రెచర్‌ తెచ్చేవరకు మోకాలు తీయలేదు.

నల్లజాతీయుడిని మోకాలుతో తొక్కిపట్టి..

ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే జార్జ్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.