Afghanistan Finance Minister Uber: ఖలీద్ పయెండా ఆరు నెలల క్రితం అఫ్ఘానిస్తాన్ ఆర్థికమంత్రి. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్వహించిన వ్యక్తి. ఆర్థికమంత్రిగా సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్న ఖలీద్ పరిస్థితి..తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడం వల్ల ఒక్కసారిగా మారిపోయింది.
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకునే వారం రోజుల ముందు తన పదవికి రాజీనామా చేసిన ఖలీద్.. అమెరికా వెళ్లిపోయాడు. ఇప్పుడు వాషింగ్టన్ రోడ్లపై క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పర్యవేక్షించిన ఖలీద్.. ఇప్పుడు ఆరు గంటల పాటు శ్రమించి 150 డాలర్లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అప్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఖలీద్ పయెండా వాషింగ్టన్‌లో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. దీంతోపాటు జార్జ్‌టౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అఫ్గాన్‌ను తాలిబన్లు అక్రమించడం వల్ల.. తనకు ఒక స్వస్థలం అంటూ లేకుండా పోయిందని ఖలీద్ ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్గాన్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోలేపోయానని వాపోయారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని నిలబెడ్డటంలో విఫమయ్యామని ఒప్పుకున్నారు.
ఇదీ చూడండి : 'మీరు ఎక్కడున్నా మాతృభూమిని మరవొద్దు'