ETV Bharat / international

ఆమె.. 27 ఏళ్ల తర్వాత పుట్టింది - శిశువు

27 ఏళ్ల పాటు దాచి ఉంచిన పిండం సాయంతో అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన టీనా గిబ్సన్ అనే మహిళ..​ ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చింది. టీనా గిబ్సన్​ గర్భాశయంలోకి పంపిన పిండాన్ని 1992లో సేకరించారు.

foetus  preserved for 27 years in america
ఆమె..27 ఏళ్ల తర్వాత పుట్టింది
author img

By

Published : Dec 6, 2020, 8:55 AM IST

ఆమె..27 ఏళ్ల తర్వాత పుట్టడమేంటీ? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఆశ్చర్యాన్ని వాస్తవం చేసింది ఆధునిక వైద్యశాస్త్రం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 27 ఏళ్ల పాటు దాచి ఉంచిన పిండం సాయంతో అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన టీనా గిబ్సన్​ ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చింది. టీనా గిబ్సన్​ గర్భాశయంలోకి పంపిన పిండాన్ని 1992లో సేకరించారు. అప్పటి నుంచి క్రయోజనిక్​ ఫ్రీజర్​లో భద్రపరిచారు. అలా ఉంచిన పిండాన్ని ఈ ఏడాది ఆరంభంలో గిబ్సన్​ గర్భాశయంలోకి పంపారు. ఆమె అక్టోబర్​ 26న మాలీ ఎవ్రెట్​ గిబ్సన్​కు జన్మనిచ్చింది.

ఇలా శీతలీకంరించిన పిండం ద్వారా శిశువుకు జన్మనివ్వటం గిబ్సన్​కు కొత్త కాదు. ఆమె మొదటి కుమార్తె ఎమ్మా రెన్​ గిబ్సన్​ కూడా 24ఏళ్ల పాటు భద్రపరిచిన పిండం నుంచి జన్మించిందే. అప్పటికి అది రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును మాలీ ఎవ్రెట్​ గిబ్సన్​ అధిగమించింది. ఆసక్తికరమైన విషయమేంటంటే..ఈ రెండు పిండాలు 1992లో ఒకే వ్యక్తి నుంచి సేకరించినవే.

ఇదీ చదవండి : చీఫ్​ మెడికల్​ అడ్వైజర్​గా ఫౌచీ కొనసాగింపు: బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.