ETV Bharat / international

మహిళపై చేయిజేసుకున్న పోలీస్ సస్పెండ్​!​

మహిళపై చేయిజేసుకున్నందుకు అమెరికా ఫ్లోరిడాకు చెందిన ఓ పోలీస్​ అధికారి సస్పెండ్​ అయ్యారు. ఎయిర్​పోర్ట్​లో వాగ్వాదానికి దిగిన ఆ నల్లజాతీయురాలిపై పోలీసు దాడి చేసిన ఘటన బాడీ కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను ప్రముఖ సినీ నిర్మాత ట్విట్టర్​లో షేర్​ చేయగా వైరల్​గా మారింది.

Florida officer suspended for hitting a woman
మహిళపై చేయిజేసుకున్న పోలీస్ సస్పెండ్​!​
author img

By

Published : Jul 3, 2020, 11:25 AM IST

అమెరికాలోని ఫ్లోరిడా, మియామి అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​లో ఓ నల్లజాతి మహిళపై దాడి చేస్తూ బాడీ కెమెరాకు చిక్కాడు ఓ పోలీస్​ అధికారి. ఈ వీడియోను దక్షిణ ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత బిల్లీ కార్బెన్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. దీంతో సదరు పోలీస్​ అధికారి సస్పెండ్​ అయ్యారు.

ఇదీ జరిగింది...

విమానం ఆలస్యమైనందుకు.. మహిళ టిక్కెట్​ కౌంటర్​ వద్ద గట్టిగా ప్రశ్నించింది. దీంతో టిక్కెట్​ ఏజెంట్​ పోలీసులను పిలిచాడు. అక్కడికి చేరకున్న పోలీసులతోనూ మహిళ అదే స్థాయిలో వాగ్వాదానికి దిగిందని స్థానిక వార్తా ప్రత్రిక పేర్కొంది.

మహిళపై చేయిజేసుకున్న పోలీస్ సస్పెండ్​!​

ఆమె 'నువ్వు నల్ల జాతీయుడివైనా.. తెల్లజాతీయుడిలా ప్రవర్తిస్తున్నావ్​. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు...' అంటూ, పోలీసు అధికారి మొహంలో మొహం పెట్టింది. దీంతో ఒక్కసారిగా పోలీస్​ అధికారి మహిళను గట్టిగా కొట్టాడు. 'ఆమె నన్ను రెచ్చగొట్టింది..' అంటూ ఆవేశంగా మహిళను నెట్టేశాడు. దీంతో అక్కుడున్న ఇతర అధికారులు..ఆమెకు సంకెళ్లు వేసి బంధించారు.

మియామి- డేడ్ పోలీస్ డైరెక్టర్ అల్ఫ్రెడో రామిరేజ్​.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా స్టేట్ అటార్నీకి కేసు అప్పగించారు.

ఇటీవల అమెరికాలో జార్జి​ ఫ్లాయిడ్​ ఘటనతో చెలరేగిన నిరసన జ్వాలలు చల్లారక ముందే.. మరో నల్లజాతీయురాలిపై పోలీసు చేయిజేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:మిస్ట‌రీ: 2నెలల్లో 350 ఏనుగుల‌ మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.