ETV Bharat / international

అమెరికాలో కాల్పులు- గర్భిణి సహా ఐదుగురు మృతి - అమెరికాలోని ఇండియానపొలిస్​లో కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ కాల్పుల్లో ఓ నిండు గర్భిణి సహా మొత్తం ఐదుగురు చనిపోయారు.

Five including pregnant woman, finally shot in Indianapolis
అమెరికాలో కాల్పులు- గర్భిణి సహా ఐదుగురు మృతి
author img

By

Published : Jan 25, 2021, 10:15 AM IST

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఐదుగురిని బలితీసుకుంది. ఇండియానపొలిస్‌లో గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ నిండు చూలాలు కూడా ఉన్నారు.

ఇండియానపొలిస్​లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. తొలుత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమెతో సహా.. కడుపులో ఉన్న శిశువు కూడా మరణించింది. కాల్పుల్లో గాయపడ్డ మరో చిన్నారి కోలుకుంటుందని పోలీసులు తెలిపారు.

అయితే.. కాల్పులకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదన్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ ప్రధానిపై అభిశంసన తీర్మానానికి డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.