సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో పాములు తమ కంటే పెద్దగా ఉన్న వస్తువులను, ఇతర జీవులను మింగేస్తూ ఉంటాయి. అయితే.. మీరెప్పుడైనా ఓ చిన్న చేప... పామును అమాంతం మింగడం(Fish swallows snake) చూశారా? "అయినా అది ఎలా సాధ్యం? చేప చిన్నగా ఉంటుంది. పాము పెద్దగా ఉంటుంది. ఇది ఎక్కడైనా జరుగుతుందా?" అని సందేహపడుతున్నారా? కానీ ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి(Snake fish video)... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
పామును చేప మింగే ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తి షేర్ చేశాడు. 'ఒక మీటర్ పొడవు ఉన్న పామును చేప మింగుతోంది,' అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే.. ఆ వీడియోలో ఉన్నది నిజంగా పాము కాకపోయినా.. అలాగే ఉండే ఓ ఈల్గా తెలుస్తోంది. వీడియోలో.. ఓ నది ఒడ్డున పొదల్లో నక్కి ఉన్న ఈల్ కోసం చేప మాటు వేసింది. అప్పుడు ఈల్ బయటకు రాగానే ఒక్కసారిగా తన నోట కరుచుకుని, నెమ్మదిగా మింగి నీటిలోకి జారుకుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ఓ మై గాడ్ ఇదెలా సాధ్యం? నేను చూస్తున్నది నిజమేనా,' అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. 'ఇదో పెద్ద వింత' అని మరో నెటిజన్ అన్నాడు. ఇప్పుడు ఆ వీడియోనూ మీరూ చూసేయండి మరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చూడండి: