ETV Bharat / international

ట్రంప్ కోలుకున్నారు సరే.. మెలానియా ఎక్కడ? - మెలానియా ట్రంప్​ కరోనా

కరోనా బారినపడ్డ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​ ఆరోగ్య వివరాలను శ్వేతసౌధం వెల్లడించడం లేదు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఒంటరిగా పాల్గొనడంపై అమెరికన్లలో అనేక సందేహాలు నెలకొన్నాయి. అసలు మెలానియా ట్రంప్​ ఎక్కడున్నారు? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? అని అగ్రరాజ్యం ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

First lady unseen as Trump restarts campaign after COVID-19
ట్రంప్​ సరే... ఇంతకీ మెలానియా ఎక్కడ?
author img

By

Published : Oct 14, 2020, 5:08 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. డొనాల్డ్​ ట్రంప్​ కరోనా బారిన పడటం, వైరస్​ నుంచి కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాల్లో మళ్లీ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ట్రంప్​ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయంపై అమెరికన్లలో అనేక సందేహాలు నెలకొన్నాయి. అసలు మెలానియా ట్రంప్​ ఎక్కడ ఉన్నారు?

సమాచారం లేదు!

తనతో పాటు మెలానియాకు కూడా వైరస్​ సోకినట్టు ఈ నెల 1న ప్రకటించారు ట్రంప్​. ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి.. అధ్యక్షుడి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూ వచ్చింది. కానీ మెలానియా ట్రంప్​ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్​డేట్​ విడుదల చేయలేదు శ్వేతసౌధం. అదే సమయంలో బహిరంగంగా ఆమె ఎప్పుడు కనపడతారనే విషయంపైనా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రథమ మహిళ కార్యాలయం కూడా ఈ విషయంపై ఎటువంటి సమాచారం అందివ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తుది దశ ఎన్నికల ప్రచారాల్లో మెలానియా ట్రంప్​ పాత్ర ప్రశ్నార్థకంగా మారింది.

మెలానియా ట్రంప్​ చివరిగా గత నెల 29న ప్రజల్లోకి వచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల మొదటి డిబేట్​ కోసం ట్రంప్​తో కలిసి క్లీవ్​ల్యాండ్​ వెళ్లారు.

ఇదీ చూడండి:- ఆ చికిత్సతో సూపర్​మ్యాన్​ అయిపోయా: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.